Unstoppable: బాలయ్య పంచ్‌లు.. రామ్‌చరణ్‌ దబిడిదిబిడే

ABN , Publish Date - Jan 05 , 2025 | 10:56 AM

‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్‌చరణ్‌, దిల్‌రాజు బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న  ‘అన్‌స్టాపబుల్‌’ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రామ్‌చరణ్‌ తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు.

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా రామ్‌చరణ్‌, దిల్‌రాజు బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న  ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable With NBK S4) షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రామ్‌చరణ్‌ తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. కుమార్తె గురించి మాట్లాడుతూ ఆయన ఎమోషనల్‌ అయ్యారు. ‘‘మా పాప నాన్న అని పిలిచిన రోజు తప్పకుండా ఫొటో రివీల్‌ చేస్తాను’’ అని అన్నారు. 

సురేఖ, అంజనా దేవి పంపిన వీడియో సందేశాన్ని ప్లే చేశారు. 2025లో తమకు వారసుడు కావాలని వారు కోరారు. పార్టీ చేసుకోవడానికి తన మామయ్య అల్లు అరవింద్‌ సరైన వ్యక్తి అని చరణ్‌ నవ్వుతూ బదులిచ్చారు. ఇందులోనే ప్రభాస్‌కు ఫోన్‌ కాల్‌ చేశారు. చరణ్ ఫ్రెండ్స్ శర్వానంద్, విక్రమ్ ఈ షోలో పాల్గొని సందడి చేశారు. 

Updated Date - Jan 05 , 2025 | 11:00 AM