Devi Sri Prasad: కష్టపడితే యూనివర్శ్‌ మనకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది

ABN , Publish Date - Feb 09 , 2025 | 02:42 PM

‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు విడుదలై, ఘన విజయాన్ని నమోదు చేసినా.. ఇప్పటి వరకు ఎటువంటి ఫంక్షన్ నిర్వహించడానికి అవకాశం లేకుండా పోయింది. సంధ్య థియేటర్ ఘటన చిత్రయూనిట్‌ని లాక్ చేసింది. కాస్త ఆ హడావుడి తగ్గడంతో.. మేకర్స్ శనివారం హైదరాబాద్‌లో చిత్ర బృందంతో సక్సెస్ మీట్‌ని నిర్వహించారు.

Pushpa 2 The Rule Success Meet

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మక రూపుదిద్దుకున్న చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై అత్యంత భారీ వ్యయంతో అన్‌ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇండియన్‌ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప-2’ సరికొత్త రికార్డులు సృష్టించింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్ర థ్యాంక్స్‌ మీట్‌‌ని శనివారం హైదరాబాద్‌ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హీరో అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌ చేతుల మీదుగా షీల్డులు బహుకరించారు.


Also Read- Chiranjeevi: ఓ మహిళ చెడమడా తిట్టేశారు.. ఎవరా అని ఆరా తీస్తే?

ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ ఈ సినిమా సక్సెస్‌ని వర్ణించడానికి మాటలతో చెప్పలేం, పుష్ప అనేది ఓ మ్యాజిక్‌. ఈ మ్యాజిక్‌ క్రియేట్‌ చేసిన హీరో, దర్శకుడు, మైత్రీ మూవీ మేకర్స్‌‌కు కృతజ్ఞతలు. కష్టపడితే యూనివర్శ్‌ మనకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది.. దీనికి నిదర్శనం ఈ సక్సెస్‌. అందరి కష్టం, నిజాయితీకి ఈ పెద్ద బ్లాక్‌బస్టర్‌ అనేది నిదర్శనం.


DSP.jpg

ఈ సినిమా కోసం అందరూ తమ మాగ్జిమమ్‌ ఎఫర్ట్‌ పెట్టారు. సుకుమార్‌ గారి విజన్‌‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చింది. ఆయన విజన్‌కు అల్లు అర్జున్‌ ప్రాణం పోశారని అన్నారు. ఈ సమావేశంలో మ్రైతీ మూవీ సీఈవో చెర్రీ, పంపిణీదారుడు శశి, హిందీ పంపిణీదారుడు అనిల్‌ తడాని, సునీల్‌, గణేష్‌ ఆచార్య, జగదీష్‌, పావని, మోనిక రామకృష్ణ, ఆదిత్య మీనన్‌, గగన్‌ విహారి, సీవీ రావు అజయ్‌, తారక్‌ పొన్నప్ప, విజయ్‌, ఫైట్‌ మాస్టర్‌ డ్రాగన్‌ ప్రకాష్‌, మహాలింగం, లక్ష్మీకాంత్‌, ముఖేష్‌ మెహతా తదితరులు పాల్గొన్నారు.


Also Read- Akhanda 2 Thandavam: ‘అఖండ 2: తాండవం’‌కి విలన్‌గా ‘సరైనోడు’ పడ్డాడులే..

Also Read- Oka Pathakam Prakaaram Review: 'ఒక పథకం ప్రకారం' పూరీ తమ్ముడికి హిట్‌ ఇచ్చిందా..

Also Read- Thandel Review: నాగ చైతన్య తండేల్ మూవీ రివ్యూ 

Also Read- Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 09 , 2025 | 02:42 PM