Trinadha Rao Nakkina: త్రినాధరావుకు మరో సినిమా సెట్.. హీరో ఎవరంటే..
ABN , Publish Date - Mar 01 , 2025 | 05:32 PM
ఇటీవల సందీప్ కిషన్ 'మజాకా’(Mazaja) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు త్రినాధ రావు నక్కిన. ఆ సినిమా విడుదలైందో లేదో మరో సినిమాకు సన్నద్ధమవుతున్నారు.
'మేం వయసుకు వచ్చాం’ (Mem Vayasuku vacham) చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు త్రినాధరావు నక్కిన(Trinadha Rao nakkina). తదుపరి సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఇటీవల సందీప్ కిషన్ 'మజాకా’(Mazaja) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు త్రినాధ రావు నక్కిన. ఆ సినిమా విడుదలైందో లేదో మరో సినిమాకు సన్నద్ధమవుతున్నారు. ఈసారి హై-ఎనర్జీ ఎంటర్టైనర్ కోసం ప్రామిసింగ్ హీరో హవీష్ కోనేరుతో జతకట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను డైరక్ట్ చేయడంలో త్రినాధరావుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో యంగ్ హీరో హవీష్ (Havish) తో డబుల్ బ్లాక్ బస్టర్ సినిమా చేసేందుకు శ్రీకారం చుట్టాడు నక్కిన త్రినాథరావు.
ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సెట్స్ పైకి తీసుకెళ్లాడట. మంచి ముహూర్తం చూసుకుని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేేస అవకాశం ఉంది. నువ్విలా, జీనియస్, 7 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ కోనేరు, త్రినాథరావు డైరెక్షన్‌లో చేయబోయే సినిమాతో తనను తాను కొత్తగా పరిచయం చేసుకోబోతున్నాడు. రైటర్ బెజవాడ ప్రసన్న అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కధను రెడీ చేసాడట. హవీష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఫార్మల్ షూట్ మొదలుపెట్టారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు.