Trinadha Rao Nakkina: అల్లు అర్జున్ సీన్ రీక్రియేషన్.. దర్శకుడు ఇమిటేషన్
ABN , Publish Date - Jan 13 , 2025 | 09:31 AM
మూడేళ్లుగా పుష్ప, పుష్ప -2 టైటిల్ ఎంతగా పాపులర్ అయిందో.. ఇటీవల పుష్ప -2 ప్రీ రిలీజ్ వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మరచిపోవడం అంతకు మించి వైరల్ అయింది.
మూడేళ్లుగా పుష్ప, పుష్ప -2 టైటిల్ ఎంతగా పాపులర్ అయిందో.. ఇటీవల పుష్ప -2 ప్రీ రిలీజ్ వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మరచిపోవడం అంతకు మించి వైరల్ అయింది. దానికి రాజకీయ రంగు పులిమి ఎంతగా కేసులు, అరెస్ట్‌లు, బెయిళ్లు దాకా వెళ్లి అల్లు అర్జున్, రేవంత్‌రెడ్డిల పేర్లు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోయాయి. అయితే ఆ రోజు బన్నీ వేదికపై సీఎం పేరు మరచిపోవడం, కవరింగ్ కోసం గొంతు పట్టేసినట్లు వాటర్ తీసుకురమ్మనడం అంతా నాటకీయంగా ఉండటంతో అంతా దానిని ఓవర్ యాక్షన్‌గా భావించారు. ఇదంతా జరిగిపోయిన గోల. అయితే ఇప్పుడు ఇదే సీన్ మళ్లీ రిపీట్ అయింది.
సందీప్ కిషన్; రీతు వర్మ జంట దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన 'మజాకా’ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేదికపై దర్శకుడు పలు వెకిలి చేష్టలు చేశారు. హీరోయిన్ అన్షు శరీరాకృతిపై డబుల్ మీనింగ్‌తో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. యాంకర్ గీతాభగత్‌ను కూడా వదలలేదు. అంతే కాదు.. సేమ్ బన్నీలాగే ఓ సీన్‌ను చేశాడు. వేదికపై తన చిత్రంలో నటించిన హీరోయిన్ రీతువర్మ పేరును మర్చిపోయినట్లు ఓవరాక్షన్ చేసి, దాహంగా ఉంది.. అంటూ మంచినీళ్ల బాటిల్ అడగడం అంతా గమనిస్తే... అల్లు అర్జున్‌ను ఇమిటేట్ చేసినట్లు,చ సీన్ రీ క్రియేట్ చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హీరోయిన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, మరల బన్నీని ఇమిటేట్ చేసినందుకు అభిమానులు నెటిజన్లు మండిపడుతున్నారు