Trinadha rao Nakkina: అనుకోకుండా జరిగినా.. తప్పు తప్పే..

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:19 PM

కొంతకాలం క్రితం జరిగిన ఈ వివాదాన్ని ఉద్దేశించి తాజాగా ఆయన మరోసారి వివరణ ఇచ్చారు దర్శకుడు. నటిని ఉద్దేశించి ఆవిధమైన కామెంట్స్‌ చేేస ఉద్దేశం తనకు లేదన్నారు.


‘మజాకా’ (Mazaka) సినిమా ప్రమోషన్స్‌లో మన్మథుడు ఫేం అన్షుపై (Anshu)దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha rao nakkina) చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఆమె శరీరాకృతి గురించి మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఆమె పేరు మర్చిపోయినట్లుగా ఆయన వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది. కొంతకాలం క్రితం జరిగిన ఈ వివాదాన్ని ఉద్దేశించి తాజాగా ఆయన మరోసారి వివరణ ఇచ్చారు దర్శకుడు. నటిని ఉద్దేశించి ఆవిధమైన కామెంట్స్‌ చేేస ఉద్దేశం తనకు లేదన్నారు. పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశానన్న ఆయన ఆ మాటలకు తన తల్లి ఎంతో బాధ పడిందని చెప్పారు. (Comments on Heroins Anshu)

 
‘‘ఆరోజు నేను కావాలని ఆ విధంగా మాట్లాడలేదు. ఆ రోజు కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు, మీడియా మిత్రులను నవ్వించే ఉద్దేశంలో మాట జారింది. అనుకోకుండానే అంతా జరిగిపోయింది. అంతేకానీ కావాలని ఆమెపై కామెంట్స్‌ చేయలేదు. కావాలని చేస్తే తప్పు చేసినట్లు అవుతుంది. తప్పు చేస్తే ఏ శిక్ష వేసినా స్వీకరించడానికి నేను సిద్థమే. అనుకోకుండా నేను ఆవిధంగా మాట్లాడినప్పటికీ తప్పు చేశాననే భావించా. ేస్టజ్‌పై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అనిపించింది. అందుకే అందరికీ క్షమాపణ కోరాను. నిజం చెప్పాలంటే, అన్షుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తను నాకు ఫోన్‌ చేసి ఏం జరిగిందని ప్రశ్నించింది. విషయం మొత్తాన్ని ఆమెకు వివరించా. తను అర్థం చేసుకుంది. ఈ ఇష్యూ జరిగినప్పుడు నాకంటే మా అమ్మ బాగా డిస్టర్బ్‌ అయింది. ఇన్నాళ్లు కష్టపడి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నావు. ఈరోజు ఎందుకు నాన్నా ఒక పదం నోరు జారావు. నీ గురించి అందరూ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. ఒక్క మాట నిన్ను దుర్మార్గుడిని చేసింది. నువ్వు అలాంటి వాడివి కాదని అందరికీ చెప్పలేను కదా. కాబట్టి, ఒకటి గుర్తుపెట్టుకో.  స్టేజ్‌ మీద మాట్లాడేటప్పుడు ప్రతి మాటను అందరూ గమనిస్తుంటారు. భవిష్యత్తులో కాస్త జాగ్రత్తగా మాట్లాడు’’ అని అమ్మ చెప్పింది. ఆమె దాదాపు వారం రోజులు ఆ బాధలో ఉండిపోయింది. ఆమెను చూసి నేనెంతో కంగారుపడ్డా. భవిష్యత్తులో ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని నిర్ణయించుకున్నా’’ అని నక్కిన త్రినాథ్‌రావు అన్నారు. సందీప్‌ కిషన్‌, రావు రామేశ్‌, రీతూ వర్మ, అన్షు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మజాకా’ ఫిబ్రవరి 26న విడుదల కానుంది.


 

Updated Date - Feb 24 , 2025 | 03:19 PM