Trinadha Rao Nakkina: చౌర్య పాఠం చెబుతానంటున్న త్రినాథరావు నక్కిన

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:34 PM

ప్రముఖ దర్శకుడు త్రినాథ రావు నక్కిన నిర్మాతగా మారారు. 'చౌర్య పాఠం' అనే సినిమాను నిర్మిస్తూ నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా జనం ముందుకు రాబోతోంది.

ప్రముఖ దర్శకులు నిర్మాతలుగా మారడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఈ దర్శకులు తమ కోసం నిర్మాతగా మారడం కాకుండా వేరే దర్శకులతో సినిమాలు తీస్తున్నారు లేదా కొత్తవారిని దర్శకులుగా పరిచయం చేస్తున్నారు. అలా ప్రముఖ నిర్మాత త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) నిర్మిస్తున్న 'చౌర్య పాఠం' (Chaurya Paatam) మూవీతో చందూ మొండేటి అసోసియేట్ నిఖిల్ గొల్లమారి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీతో ఇంద్రా రామ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీ డ్రామాకు వి. చూడామణి సహ నిర్మాత. ఇప్పటికే టీజర్, ప్రమోషనల్ సాంగ్ విడుదలయ్యాయి.


సమ్మర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా 'చౌర్య పాఠం' ఏప్రిల్ 18న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. పరీక్షలు ముగిసి, వేసవి సెలవులు ప్రారంభమౌతున్నందున ఈ రిలీజ్ డేట్ పాఠశాల, కళాశాల విద్యార్థులకు పర్ఫెక్ట్ టైం అని వారు అంటున్నారు. వినోదాన్ని ఆస్వాదించాలనుకునే స్నేహితులకు ఈ మూవీ ఒక సరదా ప్రయాణంగా ఉంటుందని చెబుతూ, లీడ్ యాక్టర్స్ వారి ముఖాలను రహస్యంగా కప్పి ఉంచిన రిలీజ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.


'చౌర్య పాఠం'లో పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) హీరోయిన్ కాగా రాజీవ్ కనకాల (Rajeev Kanakala), మస్త్ అలీ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మరో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ ఈ కథను సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) రాశారు. ఆయనే కెమెరా వర్క్ కూడా నిర్వహిస్తున్నారు. 'ఈగిల్' ఫేమ్ దావ్‌జాంద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌.

Also Read: Bobby Simha: గురువును కలిసి ఎమోషన్ అయిన బాబీ సింహా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 11 , 2025 | 03:48 PM