Trigun: మేఘా చౌదరితో కలిసి త్రిగుణ్ జిల్ జిల్ 'జిగేల్'

ABN , Publish Date - Feb 22 , 2025 | 03:07 PM

త్రిగుణ్ హీరోగా నటించిన 'జిగేల్' మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. మేఘా చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మల్లి యేలూరి దర్శకత్వం వహించారు.

త్రిగుణ్ (Trigun) , మేఘా చౌదరి (Megha Chowdary) జంటగా నటించిన సినిమా 'జిగిల్' (Jigel). ఈ కామెడీ థ్రిల్లర్ మూవీని మల్లి యేలూరి డైరక్షన్ లో డాక్టర్ వై. జగన్ మోహన్, నాగార్జున అల్లం నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తో పాటు కొన్ని లిరికల్ వీడియోలు విడుదలయ్యాయి. వాటికి చక్కని స్పందన లభించింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 7న ఈ సినిమాను జనం ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ హాస్య నటీనటులు ప్రముఖ పాత్రలు పోషించిన 'జిగేల్' మూవీ రెండున్నర గంటలపాటు వినోదాన్ని అందిస్తుందని, ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని నిర్మాతలు తెలిపారు. షియాజీ షిండే, పోసాని, రఘుబాబు, పృథ్వీరాజ్ తదితరులు నటించిన ఈ సినిమాకు 'మంత్ర' ఆనంద్ సంగీతాన్ని అందించారు.

Updated Date - Feb 22 , 2025 | 03:07 PM