Jr NTR: ‘డ్రాగన్‌’ కోసం మలయాళ బెస్ట్‌ యాక్టర్స్‌

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:46 PM

‘దేవర’ తరవాత ‘వార్‌ 2’ షూటింగ్‌లో బిజీ అయ్యారు ఎన్టీఆర్‌. మరోవైపు ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ సినిమాకు సంబంధించి రంగం సిద్థం అవుతోంది.


‘దేవర’ తరవాత ‘వార్‌ 2’ (War 2) షూటింగ్‌లో బిజీ అయ్యారు ఎన్టీఆర్‌. మరోవైపు ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ సినిమాకు సంబంధించి రంగం సిద్థం అవుతోంది. సంక్రాంతి తరవాత రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కాబోతోందని ఇన్‌ సైడ్‌ వర్గాల టాక్‌. ఇందులో ఓ కథానాయికగా ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ నటిస్తోంది. మరో కథానాయికగా రష్మికని 9Rashmika mandanna) ఎంచుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మరో రెండు కీలక పాత్రల కోసం ఇద్దరు మలయాళ నటులకు చోటు దొరకిందని తెలిసింది. అందులో ఒకరు బీజూ మీనన్‌(Biju menon), మరొకరు టొవినో థామస్‌ (Tovino Thomas). మలయాళ ఇండస్ర్టీలో బెస్ట్‌ యాక్టర్స్‌గా పేరు పొందిన స్టార్లు వీరు. ఈ ఇద్దరి రాకతో ఈ సినిమాకు మరింత వన్నె వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మైత్రీ మూవీస్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. ‘డ్రాగన్‌’ (Dragon) అనే పేరు పరిశీలనలో వుంది. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది చిత్ర యూనిట్‌ ప్లాన్‌. ఈ యేడాది ఎన్టీఆర్‌ నుంచి ‘వార్‌ 2’ రాబోతోంది. మరో నాలుగు తరవాత ప్రశాంత్‌ నీల్‌ సినిమా వస్తుంది.
       

Updated Date - Jan 06 , 2025 | 12:46 PM