Tollywood: ఊపందుకుంటున్న ఐటెం నంబర్స్..

ABN , Publish Date - Jan 08 , 2025 | 02:10 PM

Tollywood: దీంతో హాట్ బ్యూటీస్ తమవైపు నుంచి పుల్ ప్రమోషన్ ఇస్తున్నారు ‌. దబిడి దిబిడే పాట విడుదలైనప్పటి నుంచి మేకింగ్ వీడియోలను షేర్ చెస్తూ డాకు మహారాజ్ కు ఊర్వశీ హైప్ ఇస్తోంది.

urvashi rautela in dabidi dibide

ఓల్డ్ ఫ్యాషన్ అనుకున్న ఐటెం సాంగ్స్ ప్రస్తుతం తెలుగు చిత్రాలకు ఆయువు పట్టుగా నిలుస్తున్నాయి. దీంతో స్పెషల్ సాంగ్స్ చేసేందుకు స్టార్ హీరోయిన్స్ వెనుక నిర్మాతలు తిరుగుతున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి సినిమాల్లోనూ ఐటమ్స్ సాంగ్స్ ఇన్‌క్లూడ్ చేస్తున్నారు. కోట్లు ఖర్చు చేయడానికి నిర్మాతలు వెనకాడటం లేదంటే ఐటెం నంబర్స్ కి ఎంత డిమాండ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


ఐటైం సాంగ్స్ కోసం మేకర్స్ కోట్లు కుమ్మరిస్తున్నారు. పాటల సెట్స్ కోసం కోట్లు ఖర్చుపెట్టడంతో పాటు.. అందులో నటిస్తున్న హీరోయిన్స్ కు కోట్లల్లో పారితోషికం అందిస్తున్నారు. 'డాకు మహరాజ్' సినిమా కోసం ఊర్వశీ కి 2 కోట్ల ఇచ్చారనే ప్రచారం నడుస్తోంది. ఈ సినిమాలో పాటతో పాటు కొన్ని సన్నివేశాల్లోనూ ఊర్వశీ నటించింది.గతంలో వాల్తేరు వీరయ్య పాట కోసం కూడా ఊర్వశీ కోటి రూపాయలు తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక ఈమధ్యే వచ్చిన 'పుష్ప 2' లో కిసిక్ పాటకు కూడా శ్రీ లీలకు కూడా మేకర్స్ భారీ రెమ్యూనిరేషన్ ఇచ్చారు. ఎఫ్ 3 లో పూజా హెగ్దే ఓ పాటకు గానూ కోటిన్నర అందుకుంది. మాస్ కమర్షియల్ సినిమాలకే కాదు స్టార్ హీరోల కామెడీ మూవీస్ లో సెకండాఫ్ లో కథనం లో పట్టు తగ్గిందనుకున్నప్పుడు లేదా మరింత పీక్ లెవెల్ కు సినిమాను తీసుకువెళ్లాలన్నా‌.. ఐటెం సాంగ్ అనేది ఆదుకునే అంశం అవుతోంది . అయితే దీనివల్ల సినిమాకు ఐటెం భామలు తమవైపు నుంచి పుల్ ప్రమోషన్ ఇస్తున్నారు ‌. దబిడి దిబిడే పాట విడుదలైనప్పటి నుంచి మేకింగ్ వీడియోలను షేర్ చెస్తూ డాకు మహారాజ్ కు ఊర్వశీ హైప్ ఇస్తోంది.

Updated Date - Jan 08 , 2025 | 02:10 PM