IT Raids on Tollywood: చెంప చెళ్లుమనిపించిన ఐటీ అధికారులు
ABN , Publish Date - Jan 23 , 2025 | 02:02 PM
IT Raids on Tollywood: బుధవారం ఐటీ అధికారులు ఓ నిర్మాణ సంస్థలో సోదాలు చేస్తున్న క్రమంలో అందరి సిబ్బంది నుండి మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నారు. రెండు ఫోన్ లు కలిగిన ఓ వ్యక్తి మాత్రం డమ్మీ ఫోన్ అధికారులకు ఇచ్చాడు. తర్వాత ఏం జరిగిందంటే..
టాలీవుడ్ సినీ నిర్మాతలు, ప్రముఖల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు, ఆయన మిత్రుల ఇళ్లతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు యెర్నేని నవీన్, రవి శంకర్, డైరెక్టర్ సుకుమార్, మ్యాంగో మీడియా, అభిషేక్ పిక్చర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, మరికొన్ని ఫైనాన్షియల్ సంస్థలపై దాడులు జరుపుతున్నరు. అయితే ఓ నిర్మాణ సంస్థలో అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఏమైందంటే..
బుధవారం ఐటీ అధికారులు ఓ నిర్మాణ సంస్థలో సోదాలు చేస్తున్న క్రమంలో అందరి సిబ్బంది నుండి మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నారు. రెండు ఫోన్ లు కలిగిన ఓ వ్యక్తి మాత్రం డమ్మీ ఫోన్ అధికారులకు ఇచ్చాడు. ఇది గమనించిన అధికారులు రెండో ఫోన్ కూడా ఇవ్వాలని కోరారు. దీనికి ఆ ఉద్యోగి నిరాకరించడంతో అధికారులు చెంప చెళ్లుమనిపించి ఆ వ్యక్తి ఫోన్ లాకున్నారట. అలాగే బుధవారం మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఓ శిక్ష విధించినట్లు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
సుకుమార్‌కి రిలీఫ్
'పుష్ప 2' సినిమా నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు దర్శకుడు సుకుమార్ తన నిర్మాణ సమస్త సుకుమార్ రైటింగ్స్ ద్వారా భాగస్వామి అయినా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికారులు రెదను రోజుల పాటు ఆయన ఇళ్లు, ఆఫీసులలో తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఆ తనిఖీలు ముగిసినట్లు తెలుస్తోంది. ఆయన ఆఫీసులో అధికారులు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఆయన కుమార్తె సుకృతి వేణి డెబ్యూ మూవీ 'గాంధీ తాత చెట్టు' శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సినిమాకి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు.