Ind Vs Pak: స్టేడియంలో తారలు సందడే సందడి
ABN , Publish Date - Feb 24 , 2025 | 10:27 AM
భారత్-పాకిస్థాన్ (India Vs Pakistan) మ్యాచ్ అంటే భారతీయులు అందరికీ అదో కిక్కు. స్టేడియం కిక్కిరిసిపోతుంది. కన్ను ఆర్పకుండా బ్యాచ్‌ని తిలకిస్తారు.
భారత్-పాకిస్థాన్ (India Vs Pakistan) మ్యాచ్ అంటే భారతీయులు అందరికీ అదో కిక్కు. స్టేడియం కిక్కిరిసిపోతుంది. కన్ను ఆర్పకుండా బ్యాచ్‌ని తిలకిస్తారు. ఆదివారం దుబాయ్‌లో చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లోనూ ఈ దృశ్యమే ఇలాంటి దృశ్యమే కనిపించింది. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్ చిరంజీవి,, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, దర్శకుడు సుకుమార్ కుటుంబం, ఊర్వశీ రౌతెల, దర్శకుడు గౌతమ్ మీనన్ తదితరులు స్టేడియంలో ఆకర్షణగా నిలిచారు.
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా, యువ బ్యాటర్లు అభిషేక్‌శర్మ, తిలక్‌వర్మ, మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ మ్యాచ్‌ను వీక్షించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.