Celebrities wishes: కొత్త సంవత్సరం.. కొత్త విషయాలతో...
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:24 PM
పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి.. నూతన ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి అందరూ స్వాగతం పలుకుతున్నారు కొత్త ఆశలు, ఆశయాలు, అంచనాలతో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ 2025లోకి అడుగుపెట్టారు.
పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి.. నూతన ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి అందరూ స్వాగతం పలుకుతున్నారు కొత్త ఆశలు, ఆశయాలు, అంచనాలతో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ 2025లోకి అడుగుపెట్టారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని, విజయాలు అందాలని కోరుకుంటూ సినీ తారలు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొత్త సినిమా విషయాలను, అప్‌డేట్ పోస్టర్‌లను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కొత్త సంవత్సరం భారతీయ సినిమా వైభవం మరింత ప్రకాశించాలని కోరుకుంటూ చిరంజీవి (Chiranjeevi Wishes) శుభాకాంక్షలు చెప్పారు.
‘డాకు మహారాజ్’ అంటూ బాలకృష్ణ (NBK)కొత్త పోస్టర్ షేర్ చేశారు.
జనవరి 2న ‘గేమ్ ఛేంజర్’ ట్రెలర్ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. (Game Changer)
‘‘2025లో మన కొత్త ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలి. మనందరి లక్ష్యాన్ని చేరుకొనే శక్తిని 2025 అందించాలి భారతీయ సినిమా వైభవం మరింత విస్తరించి ప్రకాశవంతమవ్వాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా ప్రేమ, సంతోషంతో కలిసిమెలిసి ఆనందించండి’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
‘‘గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారం మొదలవుతోన్న నూతన సంవత్సరం సందర్భంగా ప్రతిఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ - పవన్ కల్యాణ్ (Pawan Kalyan)
‘‘హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఏడాది మరింత ఆనందాన్ని, విజయాన్ని అందించా?ని కోరుకుంటున్నా’’ - ఎన్టీఆర్ (NTR)
‘‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా అభిమానులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. లవ్ యూ ఆల్’’ - అల్లు అర్జున్(Allu arjun)
‘‘నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మరింత సామరస్యం, శాంతి, సానుకూలతతో ముందుకుసాగుదాం’’
- ధనుష్ (Dhanush)
7/G Brundavan Colony New poster