Bhagyashri Borse: సైలెంట్‌గా ఉన్నట్లు కనిపించినా.. ఇప్పుడు మాత్రం
ABN , Publish Date - Mar 25 , 2025 | 06:08 PM
అదృష్టం తలుపుతట్టడం ఆలస్యమైతే అయిందిగానీ... ఆ అమ్మడి స్పీడ్ ఇప్పుడు మాములుగా లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా చూస్తుండగానే స్టార్ బ్యూటీలను వెనక్కి నెట్టేస్తోంది. ఆ స్పీడ్ చూస్తోంటే...
అదృష్టం తలుపుతట్టడం ఆలస్యమైతే అయిందిగానీ... ఆ అమ్మడి స్పీడ్ ఇప్పుడు మాములుగా లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా చూస్తుండగానే స్టార్ బ్యూటీలను వెనక్కి నెట్టేస్తోంది. ఆ స్పీడ్ చూస్తోంటే... త్వరలోనే టాప్ చైర్ ఎక్కేలా కనిపిస్తోంది. ఆ బ్యూటీ ఎవరో భాగ్యశ్రీ బోర్సే. కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతోంది భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse). నిన్న మొన్నటి వరకు కాస్త సైలెంట్‌గా ఉన్నట్లు కనిపించినా..ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీ అంతా తనదే అనేస్తోంది.
'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan)తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. ఫస్ట్ సినిమాతోనే నటన పరంగా, గ్లామర్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. సినిమా ఫ్లాప్ గా నిలిచినప్పటికి ఈ భామ క్రేజ్ మాత్రం తగ్గేలేదు. ఓ సినిమా అలా సెట్స్ పైకి వెళ్లగానే.. మరో క్రేజీ ప్రాజెక్ట్కు సైన్ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే రాబోయే సినిమాలన్నీ ఈ భామవే. అంతే కాదు స్టార్ హీరోలకు సైతం ఫేవరేట్ అయిపోతుంది. ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ తో 'కాంత' మూవీ చేస్తోంది. విజయ్ దేవరకొండతో 'కింగ్ డమ్' (kingdom)చేస్తోంది. దీనితో పాటు రామ్ పొతినేనితో రొమాన్స్ చేయనుంది. అయితే ఈ మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. 'కింగ్ డమ్' మేలో రిలీజ్ అవుతోంది. ఇక రామ్ తో చేస్తున్న మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది. ఈ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దుల్కర్ తో చేస్తున్న 'కాంత' (Kantha)మూవీ ఇయర్ ఎండింగ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్ లో పెట్టిందీ చిన్నది. ఇందులో ఏ సినిమాకైనా హిట్ టాక్ వస్తే... బ్యూటీ దూకుడు నెక్ట్స్ లెవల్లో ఉండనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి వరుస ఫ్లాపులు వచ్చినప్పటికి కూడా కెరీర్ లో చేతినిండా అవకాశాలను దక్కించుకుంటూ ఆశ్చర్య పరుస్తోంది అమ్మడు. మరీ ఈ బ్యూటీ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలంటే మరికొంత కాలంగా ఆగాల్సిందే.