Friday Movies: ఈ వారం ఆరు వైవిధ్యమైన చిత్రాలు
ABN , Publish Date - Mar 13 , 2025 | 02:02 PM
ఈవారం ఓ అనువాదచిత్రంతో పాటు ఐదు స్ట్రయిట్ తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి ప్రియదర్శి 'కోర్టు', కిరణ్ అబ్బవరం 'దిల్ రూబా' చిత్రాలే!
మార్చి 7వ తేదీ ఏకంగా పది, పన్నెండు సినిమాలు విడుదలయ్యాయి. అయితే... అందులో చెప్పుకోదగ్గ చిత్రం కానీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సినిమా గానీ లేకపోయింది. అయితే ఈ వారం సినిమాల జోరు తగ్గింది. అయినా... ఆరు చిత్రాలు ఈ వారాంతంలో జనం ముందుకు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ చిత్రాలు మాత్రం రెండే! నాని (Nani) తాను హీరోగా నటించిన చిత్రాలనే కాకుండా కొన్ని థాట్ ప్రొవోకింగ్ మూవీస్ ను సైతం నిర్మించేందుకు ముందుకొచ్చారు. అలా ఇప్పటికే 'హిట్ (Hit), హిట్ -2' (Hit -2) చిత్రాలను నిర్మించిన నాని తాజాగా 'కోర్టు' (Court) మూవీని ప్రశాంతి త్రిపుర్నేనితో కలిసి ప్రొడ్యూస్ చేశాడు. ప్రియదర్శి (Priyadarsi) ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు చేశారు. పోక్సో యాక్ట్ నేపథ్యంలో ఈ సినిమాను రామ్ జగదీశ్ తెరకెక్కించాడు.
ఇక ఈ నెల 14న వస్తున్న మరో సినిమా 'దిల్ రూబా' (Dil Ruba). గత యేడాది దీపావళికి వచ్చిన 'క' (Kaa) మూవీతో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). అయితే... 'క' విడుదల కాకముందే 'దిల్ రూబా' మూవీ సెట్స్ మీద ఉంది. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటించిన దిల్ రూబా ను విశ్వకరుణ్ డైరెక్ట్ చేశాడు. సామ్ సీఎస్ దీని సంగీత దర్శకుడు. ప్రేమలోని గాఢతను తెలిపే చిత్రంగా 'దిల్ రూబా' తెరకెక్కింది. ఈ సినిమా విజయంపై కిరణ్ అబ్బవరం ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
Also Read: Siddhu Jonnalagadda: జాక్ టీమ్ లోకి సామ్ సి.ఎస్.
ఇక గత వారం విడుదల కాకుండా ఆగిపోయిన మలయాళ అనువాద చిత్రం 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' శుక్రవారం జనం ముందుకు వస్తోంది. కుంచాకో బోబన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రను పోషించింది. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు అక్కడ మంచి ఆదరణే లభించింది. ఇక ఈ వారం మూడు చిన్న స్ట్రయిట్ తెలుగు సినిమాలు '1000 వాలా' (1000 Wala), 'రాక్షస' (Rakshasa), 'ల్యాంప్' (Lamp) విడుదల కాబోతున్నాయి. మరి ప్రియదర్శి కోర్ట్ డ్రామా వైపు ప్రేక్షకులు మొగ్గు చూపుతారా? లేక కిరణ అబ్బవరం లవ్ స్టోరీకి పట్టం కడతారా అనేది చూడాలి.
Also Read: Ratan Rishi: ఆర్టిస్ట్ కు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ దన్ను
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి