Prudhvi: 11 సార్లు నీళ్లు తాగండి.. హీట్‌ 151కి చేరవచ్చు

ABN , Publish Date - Feb 22 , 2025 | 01:20 PM

థర్టీ ఈయర్స్‌ పృథ్వీ (30 Years prudhvi) గురించి పరిచయం అక్కర్లేదు. కమెడీయన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్‌గా ఎన్నో చిత్రాలతో అలరించారు. సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. వైసీపీ పార్టీలో కొంత జర్నీ చేశాక అక్కడ చెడి.. బయటకు వచ్చారు.


థర్టీ ఈయర్స్‌ పృథ్వీ (30 Years prudhvi) గురించి పరిచయం అక్కర్లేదు. కమెడీయన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్‌గా ఎన్నో చిత్రాలతో అలరించారు. సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. వైసీపీ పార్టీలో కొంత జర్నీ చేశాక అక్కడ చెడి.. బయటకు వచ్చారు. తదుపరి తాను విమర్శించిన జనసేన పార్టీలో చేరారు. సమయం కుదిరిన ప్రతిసారీ వైసీపీపై ధ్వజమెత్తుతుంటారు. సినిమా వేదికలపై, తాను నటించిన చిత్రాల్లో సరదగా ఆ పార్టీపై డెరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో కామెంట్స్‌ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో సినిమా వేడుకల్లో ఆయన చేసిన కామెంట్స్‌ విపరీతంగా వైరల్‌ అయ్యాయి. దాంతో ట్రోల్ అయ్యారు. సినిమా వేదికలపై చేసే కామెంట్ల వల్ల ఆయా చిత్రాలకు నష్టం జరుగుతుందని గమనించిన పృథ్వీ తన భావాలను స్వేచ్ఛగా (Prudhvi in X) అభిమానులతో పంచుకునేందుకు ఇప్పుడు సోషల్‌ మీడియాలో అడుగుపెట్టారు. శనివారం ఆయన ఎక్స్‌ ఖాతాను ఓపెన్‌ చేశారు. అందులో ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

"హాయ్‌ నేను మీ థర్టీ ఈయర్స్‌ పృధ్వీ, కొత్తగా ఎక్స్‌ ఖాతాను తెరిచాను. నేను నా భావాలను స్టేజ్‌పై వ్యక్త పరుచ్తుంటే చాలామంది ఫీల్‌ అవుతున్నారు. కాబట్టి నేటి నుంచి ఈ ఎక్స్‌ అనే వేదిక ఉపయోగించుకుని నా భావ ప్రకటన స్వేచ్ఛను తెలియపరుస్తాను’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే ఆయన పోస్ట్‌ను బట్టి చూస్తే ఆయనకు వ్యతిరేక పార్టీకి కామెంట్ల సెగ మొదలైనట్లే అని అర్థమవుతుంది.

ఇటీవల లైలా వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే! దాంతో లైలా చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయాలని సంబంధిత పార్టీ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా సినిమాను, పృథ్వీని టార్గెట్‌ చేసి ట్రోల్‌ చేశారు.



11 సార్లు నీళ్లు తాగండి.. హీట్‌ 151కి చేరవచ్చు..

ఇలా ఎక్స్‌లో అడుగుపెట్టారో లేదో.. సెటైర్లు మొదలుపెట్టారు పృథ్వీ. "రోజుకు 11సార్లు నీళ్లు తాగండి. అసలే ఎండాకాలం, 151 డిగ్రీలకు హీట్‌ టచ్‌ అచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నా తోటి సోదరుల కోసం ఈ చిట్కాలు" అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Updated Date - Feb 22 , 2025 | 02:57 PM