The Suspect: అమ్మాయి హత్యకు కారకులు ఎవరు ..
ABN , Publish Date - Mar 15 , 2025 | 05:09 PM
రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా 'ది సస్పెక్ట్' టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
రుషి కిరణ్(Rishi Kiran), శ్వేత (Swetha), రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా 'ది సస్పెక్ట్' (The suspect) టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకుడు. ఈ నెల 21న ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా (The suspect Trailer)
దర్శకుడు వీఎన్ ఆదిత్య (VN Adithya) మాట్లాడుతూ "ప్రొడ్యూసర్ కిరణ్ ఎప్పటినుంచో స్నేహితులు. ఆయన ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడమే కాదు మంచి క్యారెక్టర్ లో నటించారు. పెద్ద సినిమాలు జీరో కలెక్షన్స్ చేసినవి ఉన్నాయి. చిన్న చిత్రాలు అద్భుతంగా ఆదరణ పొందినవీ ఉన్నాయి. ది సస్పెక్ట్ సినిమా చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించాలి. ఈ సినిమా విజయం సాధిస్తే రాధాకృష్ణ లాంటి దర్శకులకు మరిన్ని అవకాశాలు వస్తాయి" అన్నారు .
నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడుతూ "సినిమా రంగంలోకి రావాలనేది నా కల. ది సస్పెక్ట్ సినిమాతో ఆ కల నెరవేరింది. రాధాకృష్ణ చేసిన ఒక షార్ట్ ఫిలిం చూసి నచ్చి ఈ సినిమాకు దర్శకత్వం చేయమని అడిగాను. రాధాకృష్ణే ఈ సినిమాకు అన్నీ తానై రూపొందించాడు. ది సస్పెక్ట్ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా" అన్నారు.
దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ " చిన్న చిత్రానికైనా పెద్ద చిత్రానికైనా పడే కష్టం ఒక్కటే. మేము ఈ సినిమాను అందరికీ నచ్చేలా మంచి సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా రూపొందించాం. ఒక అమ్మాయి హత్యకు కారకులైన వారిని పట్టుకునే క్రమంలో సాగే చిత్రమిది. కొత్త ఆర్టిస్టులైనా ఎంతో అనుభవం ఉన్న వారిలా బాగా యాక్ట్ చేశారు. ఈ నెల 21న థియేటర్స్ లోకి వస్తున్న ది సస్పెక్ట్ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి