The Raja Saab: ఇన్‌డైరెక్ట్‌ హింట్‌.. మే మధ్యలో వేడి గాలులు..

ABN , Publish Date - Apr 25 , 2025 | 01:56 PM

మే నెలలో ‘ది రాజాసాబ్‌’ టీజర్‌ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తునట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. దీనిపై దర్శకుడు మారుతి సోషల్‌ మీడియా వేదికగా ఇన్‌డైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చారు.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజాసాబ్‌’ (The Raja Saab) . మారుతి (maruti)దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్‌, మాళవిక మోహనన్‌ కథానాయికలు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉందీ సినిమా. మే నెలలో టీజర్‌ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తునట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడీ అంశంపై దర్శకుడు మారుతి సోషల్‌ మీడియా వేదికగా ఇన్‌డైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చారు. తాజాగా ఆయన ఓ ఆటో వెనకున్న ‘రాజాసాబ్‌..’ పోస్టర్‌ను ఎక్స్‌లో షేర్‌ చేసి దానికి ‘‘హై అలర్ట్‌.. మే మధ్య నుంచి వేడి గాలులు మరింత పెరగనున్నాయి’’ అని పోస్ట్‌లు పేర్కొన్నారు.

దీంతో మే మిడ్‌లో ఈ చిత్ర టీజర్‌ విడుదల కానుందని పరోక్షంగా స్పష్టత వచ్చింది. ఇప్పటికే ఈ టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్‌ పనులు పూర్తయ్యాయని.. విదేశాల నుంచి ప్రభాస్‌ తిరిగి రాగానే తనతో డబ్బింగ్‌ పూర్తి చేసి టీజర్‌ విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని చిత్ర వర్గాలు నుంచి సమాచారం. రొమాంటిక్‌ కామెడీ హారర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్‌ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని టాక్‌.

Updated Date - Apr 25 , 2025 | 02:03 PM