The Paradise: నేచురల్ స్టార్ నాని నయా అవతార్
ABN , Publish Date - Mar 03 , 2025 | 12:06 PM
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' మూవీ గ్లింప్స్ వచ్చింది. ఇందులో కఠోర వాస్తవాలు, కఠోరమైన సంభాషణలు ఉంటాయని ముందే డిస్ క్లైమర్ లో మేకర్స్ పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగానే ఇది ఉంది.
నేచురల్ స్టార్ నాని (Nani) ఇప్పుడు అన్ నేచురల్ క్యారెక్టర్స్ చేయడానికి తాపత్రయ పడుతున్నాడు. 'దసరా' (Dasara) మూవీ నుండి ఆ రకంగా ముందు కెళుతున్నాడు. 'దసరా' కథ 1980 నాటిది కాగా ఇప్పుడు అదే చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో చేస్తున్న 'ది పారడైజ్' ఇంకా పాత కథ. తాజాగా ఈ సినిమా నుండి గ్లింప్స్ విడుదలైంది. 'మదర్ స్టేట్ మెంట్' పేరుతో వచ్చిన ఈ గ్లింప్స్ ను రా స్టేట్ మెంట్ అంటూ మేకర్స్ పేర్కొన్నారు. అంతేకాదు... రా ట్రూత్, రా లాంగ్వేజ్ అంటూ ఓ డిస్ క్లైమర్ కూడా వేశారు. కాకుల కథను చెప్పబోతున్నానని శ్రీకాంత్ ఓదెల ఇందులో పేర్కొన్నాడు. అలాంటి కాకులు ఆయుధం పడితే ఎలా ఉంటుందో ఈ గ్లింప్స్ లో రుచి చూపించాడు. అయితే సమ్ థింగ్ స్పెషల్ గా పాత్రలను తీర్చిదిద్దే క్రమంలో నానిని పూర్తిగా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. రెండు జడలతో ఉన్న నాని ని ఆయన అభిమానులు, తెలుగు సినీ జనాలు ఏ మేరకు ఓన్ చేసుకుంటారన్నది పక్కన పెడితే ఇతర భాషలల్లో వారికి మాత్రం ఇదో ప్రయోగాత్మక చిత్రం అనే భావన కలుగుతుంది. మన దర్శకులు 'కేజీఎఫ్' (KGF) హ్యాంగోవర్ నుండి ఇంకా బయటకు రాలేదనే భావన కూడా ఈ వాయిస్ ఓవర్ వింటుండే, విజువల్స్ చూస్తుంటే అనిపిస్తుంది.
ఏదేమైనా నాని, శ్రీకాంత్ ఓదెల మాత్రం ఓ సరికొత్త 'ప్యారడైజ్'(The Paradise) లోకి ప్రేక్షకులను తీసుకెళ్ళ ప్రయత్నాన్ని చేశారు. దీనిని చూస్తుంటే... 'దసరా'ను మించిన రా నెస్ ఈ మూవీలో ఉంటుందని అనిపిస్తోంది. అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ మూవీలో నాని తల్లిపాత్రను సోనాలి కులకర్ణి చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 26న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
Also Read: V.V. Vinayak: ఆరోగ్యంగానే ఉన్నానంటున్న వినాయక్!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి