Sukumar: సుకుమార్ ది రూల్, ది రైజ్

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:59 PM

Sukumar: గత దశాబ్ద కాలంలో భారతీయ సినీ ఇండస్ట్రీ అసలైన 'ది రైజ్, 'ది రూల్'ని చూసింది. ప్రత్యేకంగా సౌతిండియన్ సినిమా.. ఇండియన్ సినిమా పేస్‌గా మారింది. ఈ రైజ్ అండ్ రూల్ లో కీలకమైన వ్యక్తులుగా ఇద్దరి పేర్లు చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకరు ఎస్ఎస్ రాజమౌళి, ఇంకొకరు సుకుమార్. ఈరోజు 'ది మాస్టర్ అఫ్ స్టోరీ టెల్లింగ్' సుకుమార్ 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.

sukumar birthday special

గత దశాబ్ద కాలంలో భారతీయ సినీ ఇండస్ట్రీ అసలైన 'ది రైజ్, 'ది రూల్'ని చూసింది. ప్రత్యేకంగా సౌతిండియన్ సినిమా.. ఇండియన్ సినిమా పేస్‌గా మారింది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ రారాజుగా మారి భారతీయ సినిమా సామ్రాజ్యాన్ని ఏలుతోంది. ఈ రైజ్ అండ్ రూల్ లో కీలకమైన వ్యక్తులుగా ఇద్దరి పేర్లు చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకరు ఎస్ఎస్ రాజమౌళి, ఇంకొకరు సుకుమార్. ఈరోజు 'ది మాస్టర్ అఫ్ స్టోరీ టెల్లింగ్' సుకుమార్ 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.


ది రైజ్

సుకుమార్ 2004లో ఆర్య సినిమాతో తెరంగ్రేటం చేసి.. అప్పటి వరకు తెలుగు సినిమా ఎప్పుడు చూడనంత ఫ్రెష్ మూవీని అందించాడు. దీంతో ఆయనను అందరు రొమాంటిక్ డ్రామాలు చెక్కే అర్బన్ ఫిల్మ్ మాస్టర్ అనుకున్నారు. కానీ.. తన రెండవ సినిమా 'జగడం'తోనే ఒక మైక్రో యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కించాడు. ఇది కమర్షియల్ గా ప్లాప్ అయినప్పటికీ సినీ విమర్శకులు మాత్రం ఈ చిత్రాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ రా యాక్షన్ ఫిల్మ్ గా అభివర్ణిస్తారు. ఇక మూడవ సినిమా కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో జత కలిసి ఆర్య 2 సినిమాని తెరకెక్కించాడు(అప్పట్లో ఎవరు ఊహించి ఉండరు, వీళ్లిద్దరి స్నేహం ఒక పెను సంచలనంగా మారనుందని). తర్వాత చేసిన 100% లవ్ కమింగ్-ఏజ్ క్యారెక్టరైజేషన్స్, రిలేటేబుల్ స్టోరీ టెల్లింగ్‌ తో స్పెషల్ మార్కును వేశాడు. నాన్నకు ప్రేమతో సినిమాతో ఎమోషన్స్ ని స్క్రీన్ పై అద్భుతంగా చూపించడంలో ఒక కొత్త మాస్టర్ వచ్చినట్లు అనౌన్స్ చేశాడు. మహేష్ బాబు '1 నేనొక్కడే' సినిమాతో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తెరకెక్కించి.. ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేసి, తాను బోల్తా పడ్డాడు.


sukumar2.0.jpg

ది రూల్

సుక్కు కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి వచ్చి.. టాప్ ఇండియన్ డైరెక్టర్స్ ని ఒక అభ్రదత భావాన్నికి గురిచేసేలా తీసిన సినిమా రంగస్థలం. ఇదొక క్లాసిక్. చరణ్ తన కెరీర్ లో ఈ సినిమాకంటే పెద్ద చిత్రాలు చేయొచ్చు, కలెక్షన్స్ రాబట్టొచ్చు కానీ.. ఆయన నటనకు ప్రాణం పోసింది మాత్రం రంగస్తలమే.

ఈ మూవీ తర్వాత తన స్నేహితుడు అల్లు అర్జున్ తో జత కలిసి నిర్మించిన 'పుష్ప' సినిమా కల్చరర్ బేరియర్స్ ని బ్రేక్ చేసింది. ఒక యాక్షన్, డ్రామా ఏది ఎంత కొలతలో వెయ్యాలో మాస్టర్ చూపించి కొత్త ఫిల్మ్ మేకర్స్ కి మార్గదర్శకుడిగా మారాడు. కాస్త ఆలస్యంగా వచ్చిన 'పుష్ప 2'తో బాక్సాఫీస్ వద్ద రూ. 1,850 కోట్లతో ఊచకోత కోశాడు. ఈ సందర్భంగా ఆయన మరెన్నో ఉన్నత చిత్రాలను తీయాలని మనసారా కోరుకుందాం.

Also Read-Mega Vs Allu: ఎన్నిసార్లు కొట్టినా చావని పాములురా మీరు..

Also Read-Allu Arjun: బన్నీ మాస్టర్ ప్లాన్.. ఇక ఆపేవాడే లేడు

Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ

Also Read- Brahmanandam: హాస్య'బ్రహ్మ'పై దాడి


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 11 , 2025 | 01:05 PM