యుగళ గీతం
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:41 AM
తమిళ నటుడు చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో రియా శిబు నిర్మించారు...
తమిళ నటుడు చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో రియా శిబు నిర్మించారు. ఎస్‌జే సూర్య, దుషార విజయన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా, ఈ చిత్రం నుంచి ‘కలల్లో కానరాకున్నా.. నీకోసం నేను వేచి ఉన్నా’ అంటూ సాగే యుగళ గీతాన్ని విడుదల చేశారు మేకర్స్. రాజేశ్ గోపిశెట్టి లిరిక్స్ అందించగా, శరత్ సంతోష్, రేష్మ, శ్యామ్ ఆలపించారు. జివి ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదలవుతోంది.
For AndhraPradesh News And Telugu News