Thandel: సంధ్య థియేటర్ ఎఫెక్ట్.. ‘తండేల్’ వేడుకకు నో ఎంట్రీ బోర్డ్..
ABN , Publish Date - Feb 02 , 2025 | 06:50 PM
‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ‘పుష్ప 2’ సంధ్య థియేటర్ ఎఫెక్ట్ పడింది. పబ్లిక్‌గా జరగాల్సిన వేడుకను కేవలం చిత్రయూనిట్ సమక్షంలో మాత్రమే జరుపుతున్నారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో.. ఈవెంట్‌ని పూర్తిగా మార్చేశారు. పబ్లిక్‌కు నో ఎంట్రీ బోర్డులు పెట్టేశారు. అసలు విషయం ఏమిటంటే..
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి జంటగా.. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న చందూ మొండేటి రూపొందిస్తోన్న చిత్రం ‘తండేల్’. ఈ సినిమాపై ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ ఎఫెక్ట్ బాగా పడింది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ వేడుక.. ఆదివారం ఎటువంటి హడావుడి లేకుండా, కేవలం చిత్రయూనిట్ సమక్షంలోనే జరగబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి కారణం మాత్రం ‘సంధ్య’ థియేటర్ ఘటనే.
Also Read- Janhvi Kapoor: జాన్వీ కపూర్ కండోమ్ యాడ్‌కు పర్ఫెక్ట్.. కండోమ్ సంస్థ అధినేత
విషయంలోకి వస్తే.. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించి ఉన్నారు. అల్లు అర్జున్‌తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ఈ ‘ఐకానిక్ తండేల్ జాతర’ పేరుతో నిర్వహిస్తున్న ప్రీ రిలీజ్ వేడుకకు పబ్లిక్ ఎవరూ రావద్దు అంటూ బోర్డులు పెట్టేశారు. ఈ వేడుకకు పబ్లిక్‌కు ఎంట్రీ లేదని, కేవలం ప్రసార మాధ్యమాలలో మాత్రమే ఈ వేడుకను చూడాలని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది.
ఈ ప్రకటనతో ఫ్యాన్స్ అంతా డిజప్పాయింట్ అవుతుంటే.. ఇది అల్లు అర్జున్ తీసుకున్న ముందు జాగ్రత్తగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్‌ని ఎంతగా మార్చి వేసిందో అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. మొత్తంగా అయితే.. ‘పుష్ప 2’ ఘన విజయం తర్వాత ఒక్క సక్సెస్ ఈవెంట్ కూడా మేకర్స్ నిర్వహించలేదు. ఆ సినిమా సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ అటెండ్ అవుతున్న అఫీషియల్ ఫంక్షన్ ఇదే కావడంతో.. ఫ్యాన్స్ ఈ వేడుకకు భారీగా రావాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, చివరి నిమిషంలో ఈ వేడుకను కేవలం చిత్రబృందం సమక్షంలోనే నిర్వహించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.