Thaman: అవి బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డాం

ABN , Publish Date - Jan 01 , 2025 | 10:20 AM

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) . కియారా అడ్వాణీ (Kiara adwani) హీరోయిన్‌. సంగీత దర్శకుడు తమన్‌ ఎక్స్‌ వేదికగా అభిమానులతో  చిట్‌చాట్‌ చేశారు.

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) . కియారా అడ్వాణీ (Kiara adwani) హీరోయిన్‌. సంగీత దర్శకుడు తమన్‌ ఎక్స్‌ వేదికగా అభిమానులతో  చిట్‌చాట్‌ చేశారు. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘గేమ్‌ ఛేంజర్‌’ అన్ని అంశాల్లోనూ భారీ చిత్రం. పాటలన్నింటినీ 2021 డిసెంబర్ లోపే పూర్తి చేశా. శంకర్‌ సర్‌ సినిమాకి అంత వేగంగా కంపోజింగ్‌ అయిపోతుందని నేను  హించలేదు. అవి బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డాం. వాటి చిత్రీకరణ విషయంలో శంకర్‌, నిర్మాత దిల్‌ రాజు ఎక్కడా రాజీపడలేదు. ‘జరగండి జరగండి’ పాట అద్భుతం. కళ్లజోడు లేకుండానే 3డీ చూసినట్టు ఉంటుంది. ఇందులో ఆరు పాటలున్నాయి. జనవరి 4న రెండు సాంగ్స్‌ విడుదల చేయనున్నాం. రిలీజ్‌కు మరో బిట్‌ సాంగ్‌ కూడా ఉంది. ఆయనతో కలిసి పని చేయాలనే నా డ్రీమ్‌ ఈ చిత్రంతో నెరవేరింది. ఈ సినిమాతో శంకర్‌ ఎడిటింగ్‌ విషయంలో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేయబోతున్నారు. మూవీ సెకండాఫ్‌ రేసీగా ఉంటుంది. రామ్‌ చరణ్‌ స్ర్కీన్‌ ప్రెజెన్స్‌ అదుర్స్‌. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో చరణ్‌, అంజలి పాత్రకు ప్రశంసలు దక్కుతాయి. అంజలికి జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నా. ‘ఇండియన్‌ 2’ ఫలితంపై కాస్త నిరాశ చెందిన డైరెక్టర్‌ శంకర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’తో హిట్‌ కొట్టేస్తారు’’ అని అన్నారు. అంజలి, శ్రీకాంత్‌, నవీన్‌ చంద్ర, ఎస్‌.జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్‌రాజు నిర్మించిన 50వ సినిమా ఇది. సంక్రాతి కానుకగా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Jan 01 , 2025 | 10:32 AM