Thalvar: పూరి తనయుడి పాన్ ఇండియా మూవీ...

ABN , Publish Date - Feb 26 , 2025 | 07:48 PM

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'తల్వార్'. శివరాత్రి కానుకగా ఈ సినిమా ఆడియో గ్లింప్స్ విడుదలైంది.

ప్రముఖ దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ జగన్నాథ్ (Akash Jagannadh) హీరోగా నటిస్తున్న సినిమా 'తల్వార్' (Thalvar). భాస్కర్ ఇ.ఎల్.వి. నిర్మిస్తున్న ఈ సినిమాను కాశీ పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. గతంలో 'అశ్వద్థామ (Ashwathhama), లక్ష్య (Lakshya)' చిత్రాలకు రైటర్ గా వర్క్ చేసిన కాశీ పరశురామ్ 'రణస్థలి' మూవీని డైరెక్ట్ చేశారు. విశేషం ఏమంటే ఈ సినిమాలో పూరి జగన్నాథ్ (Puri Jagannadh) సైతం కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఆయనతో పాటుగా ప్రకాశ్ రాజ్ (Prakash Raj), షిన్ టామ్ చాకో (Shine Tom Chacko), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), అజయ్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.


తాజాగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 'తల్వార్' మూవీ ఆడియో గ్లింప్స్ ను విడుదల చేశారు. తరతరాలుగా న్యాయానికి, అన్యాయానికి జరుగుతున్న యుద్థంలో ఆయుధాలు ఎలా మారుతూ వచ్చాయో హీరో వాయిస్ లో వినిపించారు. అయితే... ఒక్కోసారి న్యాయం గెలవడం కోసం అన్యాయం చేయాల్సి ఉంటుందని చెప్పడం విశేషం. ఆకాశ్ జగన్నాథ్ బేస్ వాయిస్ తో చెప్పిన ఈ ఆడియో గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. రీసెంట్ గా షూట్ స్టార్ట్ అయిన 'తల్వార్' మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Updated Date - Feb 26 , 2025 | 07:48 PM