Mohan Babu: 'మంచు'లో ఆరని మంటలు
ABN , Publish Date - Jan 15 , 2025 | 01:41 PM
Mohan Babu: కాలేజీ గేట్లు మూసి వేసి.. పరిసర ప్రాంతాలకు ఎవరినీ అనుమతించడం లేదు. మీడియా (Media)ను సైతం అక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది హుకుం జారీ చేసింది.
దర్శక, నిర్మాత, నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu) తిరుపతి (Tirupathi) కాలేజ్ (College) వద్ద ఉద్రిక్తత (Tension) చోటు చేసుకుంది. మోహన్‌బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) కాలేజీ వద్దకు వస్తాడన్న సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాలేజీ గేట్లు మూసి వేసి.. పరిసర ప్రాంతాలకు ఎవరినీ అనుమతించడం లేదు. మీడియా (Media)ను సైతం అక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది హుకుం జారీ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు (Police) కూడా కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే కాలేజీ వద్ద మోహన్ బాబు, మంచు విష్ణు ఉన్నారు. దీంతో మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు.. భద్రతా కట్టుదిట్టం చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా మంచు ఫ్యామిలీలో ఇటీవల వరసగా కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ వ్యవహార శైలితో.. ఆ కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్లుగా పరిస్థితి మారింది.