TFJA: ఫ్రీ హెల్త్ క్యాంపు.. దిల్ రాజు ఏమన్నారంటే 

ABN , Publish Date - Feb 02 , 2025 | 10:29 AM

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు, హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా క్యాంప్ (Free Health Camp) ప్రారంభించడం జరిగింది. సినీ జర్నలిస్టులు, వారి కటుంబ సబ్యులకు ఉచితంగా టెస్టులు నిర్వహించారు. 

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ శనివారం ఫిలిం ఛాంబర్ లో  నిర్వహించారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు, హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా క్యాంప్ (Free Health Camp) ప్రారంభించడం జరిగింది. సినీ జర్నలిస్టులు, వారి కటుంబ సబ్యులకు ఉచితంగా టెస్టులు నిర్వహించారు. '

TFja-1.jpg

దిల్ రాజు (Dil raju) మాట్లాడుతూ "నిత్యం బిజీగా ఉండే ఫిలిం జర్నలిస్టులు ఆరోగ్యంపై అవగాహన, శ్రద్ధ అవసరం కాబట్టి ఇలాంటి క్యాంపులు వల్ల మరింత ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి" అని చెప్పారు. విశ్వక్ సేన్ (Vishwak Sen) మాట్లాడుతూ మా అందరితో సరదాగా ఉండే జర్నలిస్టులు ఎప్పుడు అదే విధంగా ఉండాలి అంటే  దానికి హెల్త్ క్యాంపులు మరింత ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ సి.ఓ.ఓ భాస్కర్ రెడ్డి గారు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో ఒక ఏం.ఓ.యు కుదుర్చుకున్నారు.

TFja-2.jpg

Updated Date - Feb 02 , 2025 | 10:29 AM