Sankranti Movies: నిబంధనల ఎఫెక్ట్‌ ఏమేరకు..

ABN , Publish Date - Jan 01 , 2025 | 09:19 AM

రానున్న రోజుల్లో తెలంగాణాలో సినిమా ఈవెంట్స్‌ హడావుడి తగ్గనుంది. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లో ఈవెంట్స్‌పై కఠినంగా వ్యవహరించనుండటం, రిలీజ్‌పై ఎలాంటి బెనిఫిట్‌కు ఆస్కారం లేదని చెప్పేసిన తరుణంలో ఇక సినిమా సందడంతా ఆంధ్రాలో ఉండనుందని తెలుస్తోంది.

రానున్న రోజుల్లో తెలంగాణాలో సినిమా ఈవెంట్స్‌ హడావుడి తగ్గనుంది. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లో ఈవెంట్స్‌పై కఠినంగా వ్యవహరించనుండటం, రిలీజ్‌పై ఎలాంటి బెనిఫిట్‌కు ఆస్కారం లేదని చెప్పేసిన తరుణంలో ఇక సినిమా సందడంతా ఆంధ్రాలో (Sankranti Sandadhi) ఉండనుందని తెలుస్తోంది. రాబోయే సంక్రాంతి సినిమాల రిలీజ్‌ హడావుడితో పాటు వాటి ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ కూడా భారీగా చేయాలంటే,  హీరోలు మేకర్స్‌ ఇప్పుడు ఏపీ వైపే చూస్తున్నారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న "డాకూ మహరాజ్‌’ (daaku Maharaj) ఈవెంట్‌ అమరావతిలో జరగనుంది. జనవరి 4న రాజమండ్రిలో గేమ్‌ ఛేంజర్‌ (Game changer) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుండగా దీనికి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. నిజానికి ఈ ఈవెంట్‌కు తొలుత మెగాస్టార్‌ చిరంజీవి కూడా హాజరవుతారనే ప్రచారం నడిచింది. కానీ చిరంజీవి వెళ్లడం లేదని ఆయన టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం రేవంత్‌ రెడ్డి మీటింగ్‌కు కూడా  చిరంజీవి హాజరుకాలేదు. అప్పటికే చిరంజీవి చైన్నైలో కొన్ని కార్యక్రమాలకు  హాజరు కావాల్సిన నేపథ్యంలో అటు వెళ్లారు. ఈ క్రమంలో ఇప్పుడు రామ్‌ చరణ్‌  ఈవెంట్‌ కు పవన్‌ కల్యాణ్‌ వస్తున్నారు కాబట్టి .. చిరంజీవి కూడా అతిధిగా హాజరైతే బాగుంటుందని మెగా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అయితే డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌ హాజరవుతున్న తొలి సినిమా వేడుక ఇది. దీంతో ఆయన ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా సాగనుంది. 'గేమ్‌ ఛేంజర్‌ ట్రైలర్ ను గురువారం విడుదల చేయనున్నారు. 

game.jpeg

నిబంధనల ఎఫెక్ట్‌ ఏమేరకు..
"గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యే మొదటి సినిమా. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తెలంగాణలో టికెట్‌ హైక్‌, బెనిఫిట్‌ షోలు లేని కారణంగా ఇక్కడ ఓపెనింగ్‌ పరంగా ఎఫెక్ట్‌ ఈ సినిమాకే ఎక్కువ పడే చాన్స్‌ ఉందని చెబుతున్నారు. పండగ సీజన్‌లో తన కుమారుడి సినిమాకు ఓపినెంగ్స్‌ బాగా ఉండాలనే రిలీజ్‌ కానున్న విశ్వంభర చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం తాజా నిర్ణయాల ప్రకారం నడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గేమ్‌ ఛేంజర్‌ తర్వాత విడుదలయ్యే డాకూ మహరాజ్‌ చిత్రం భోగి రోజున విడుదల కానుండగా, వెంకటేష్‌ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సంక్రాంతి రోజే జనవరి 14న రానుంది. వీటిలో వెంకటేష్‌ సినిమాకే విడుదల పరంగా సౌలభ్యం ఎక్కువగా కనిపిస్తోంది. పండుగ నేపథ్యంలో సినిమా రూపొందటం,  పండుగగే విడుదల అవుతుండటం ..సినిమాకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు.      

Updated Date - Jan 01 , 2025 | 09:44 AM