Tanikella Bharani: 13 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టనున్న భరణి
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:36 PM
మళ్లీ 13 ఏళ్ల తర్వాత తనికెళ్ల భరణి మెగాఫోన్ పట్టనున్నారు. ఉగాదిని పురస్కరించుకుని ఆ వివరాలు ప్రకటించారు.
ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన తనికెళ్ల భరణిలో మంచి రచయిత కూడా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఎన్నో చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన ఆయన ‘సిరా’ (షార్ట్‌ఫిల్మ్), ‘మిథునం’తో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. రెండే క్యారెక్టర్లు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మిథునం’ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. మిథునం చిత్రం తర్వాత దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చారు తనికెళ్ల భరణి.
మళ్లీ 13 ఏళ్ల తర్వాత ఆయన మెగాఫోన్ పట్టనున్నారు. ఉగాదిని పురస్కరించుకుని ఆ వివరాలు ప్రకటించారు. తాను దర్శకత్వం వహించనున్న సినిమాలోని హీరో, హీరోయిన్ల కోసం న్యూ టాలెంట్స్‌కు ఆహ్వానం పలికారు. ఈ సినిమా కథ మేరకు 20 నుంచి 25 మధ్య వయసున్న 8 మందిని ఎంపిక చేస్తానని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు తమ వివరాలను sivasubrahmanyam.23 @gmail.comకు, 8897496143, 9701522123 వాట్సాప్ నంబర్లకుగానీ పంపమని కోరారు.