Nagarjuna: నాగార్జున వందవ చిత్రానికి కసరత్తులు..

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:39 PM

నాగ్‌ సెంచరీకి అతి దగ్గరలో ఉన్నారు. ఆయన తన వందో సినిమాని ప్రత్యేకంగా డిజైన్‌ చేయాలనుకొంటున్నారు.


చిరంజీవి, బాలకృష్ణ వంద సినిమాల మైల్‌స్టోన్‌ దాటి చాలా కాలమైంది. ఇప్పుడు నాగార్జున (Nagarjuna) వంతు వచ్చింది. నాగ్‌ సెంచరీకి అతి దగ్గరలో ఉన్నారు. ఆయన తన వందో (Nagarjuna 100th movie) సినిమాని ప్రత్యేకంగా డిజైన్‌ చేయాలనుకొంటున్నారు. ప్రస్తుతం కూలీ, కుబేర చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలతో ఆయన మళ్లీ ఫామ్‌ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జోష్‌తో తన వందో సినిమాకు శ్రీకారం చుట్టా?ని ్ఘ?ివిస్తున్నారు. టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నిర్మాత నాగార్జున కోసం కథలు వినే పనిలో ఉన్నారు. కే.ఏ.కార్తిక్‌ అనే ఓ తమిళ దర్శకుడు ఇటీవల ఓ కథ వినిపించినట్టు తెలిసింది. ఆ కథ కింగ్‌ నాగ్‌కి బాగా నచ్చిందట. అన్నీ కుదిరితే నాగార్జున చేసే వందో చిత్రం ఇదే కావచ్చని  సమాచారం.

కార్తీక్‌ (Karthik) తమిళంలో 'నితమ్‌ వరు వానమ్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్లాస్‌ టచ్‌తో సాగే కథ ఇది. అయితే నాగార్జున కోసం మాత్రం పూర్తి స్థాయి కమర్షియల్‌ కథని ఎంచుకొన్నారని సమాచారం. వందో సినిమా కాబట్టి, ఓ స్టార్‌ డైరెక్టర్‌ ఉంటే బాగుంటుందన్నది అక్కినేని ఫ్యాన్స్‌ ఆలోచన. కానీ నాగ్‌ ఎప్పుడూ కొత్తతరాన్ని ప్రొత్సహిస్తుంటారు. కథ నచ్చితే దర్శకుడు కొత్త, పాత అనేది ఆలోచించరు. ఈ సారి కూడా అదే లెక్కల్లో ఈ సినిమాని పట్టాలెక్కిస్తున్నారని తెలుస్తోంది. ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాల తర్వాత ఈ సినిమా ఉంటుందని టాక్‌.

Updated Date - Mar 16 , 2025 | 03:43 PM