SYG:1000 మంది డాన్సర్లతో మెగా సుప్రీం హీరో రచ్చ

ABN , Publish Date - Mar 05 , 2025 | 06:01 PM

సాయి దుర్గా తేజ్ తాజా చిత్రం 'సంబరాల ఏటిగట్టు' పాట చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. ఈ పాటలో ఏకంగా వెయ్యి మంది డాన్సర్స్ పాల్గొన్నారట.

పాన్ ఇండియా (Pan India) ట్రెండ్ మొదలయ్యాక.... మేకర్స్ మైండ్ సెట్ మారింది. రీచ్ లుక్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. పైగా జిగేల్ మనే పాటల కోసం ఓ రేంజ్ లో ఖర్చు చేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. జనరల్ గా ఓ సినిమా పాట అంటే హీరో హీరోయిన్లు కాకుండా పది, పదిహేను, ఇరవై మంది డ్యాన్సర్లు ఉంటుంటారు. పోనీ కొన్నిసార్లు ఓ వంద మంది ఉండచ్చు. అయితే, ఇప్పుడు మెగా హీరో సాంగ్ కోసం ఏకంగా 1000 మంది డ్యాన్సర్లు రంగంలోకి దిగడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) 'సంబరాల ఏటిగట్టు' (SYG) అంటూ ఓ డిఫరెంట్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. 1947 హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ మూవీ కోసం మేకోవర్ ను మార్చుకున్నాడు. దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు 65 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీలో రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతుందట. తాజాగా మరో క్రేజీ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది.


మొన్నటి వరకు యాక్షన్ బాట పట్టిన సాయిదుర్గ తేజ్ ఇప్పుడు డ్యాన్సర్ గా మారబోతున్నాడు. ప్రస్తుతం దినేష్ మాస్టర్ కొరియోగ్రఫిలో ఒక లావిష్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ పాటలో ఏకంగా 1000 మంది డ్యాన్సర్లు పాల్గొనబోతున్నారట. ఈ సాంగ్ సినిమాలో విజువ‌ల్ ట్రీట్ గా నిలుస్తుంద‌ని చెబుతున్నారు. ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన విశేషాలు, ఖర్చు చేసిన బడ్జెట్ వివరాలు ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి అటు యాక్షన్ పార్ట్ తో ఇటు సాంగ్ షూట్ తో సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేట్ అయింది. సెప్టెంబర్ 25 న విడుదల కానున్న ఈ మూవీ మరెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read: Nayanthara: కమల్, అజిత్ ను ఫాలో అవుతున్న నయన్!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 05 , 2025 | 06:01 PM