Krishna: సూపర్‌స్టార్ కృష్ణ ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవో తెలుసా..
ABN , Publish Date - Jan 02 , 2025 | 02:37 PM
సూపర్‌స్టార్ కృష్ణ వంటి వారు ఆరోగ్యకరమైన ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యతీ ఇచ్చేవారు. ఆహారపు అలవాట్లలో కృష్ణ తీరు వేరుగా ఉంటుంది. కృష్ణ షూటింగ్ లేని సమయంలో ఇంట్లోనే ఉండేవారు.
సినీ నటీనటులకు ఆరోగ్యం, ఆహార్యం (Food Habbits) విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాయామాలతోపాటు తినే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉంటారు. సెలెక్టివ్ ఫుడ్‌నే తీసుకుంటారు. ప్రతి రోజు ఇన్ని గంటలు అని టైమ్ టేబుల్ ప్రకారం వర్కవుట్స్ చేస్తారు. అయితే ఇదంతా ఈతరం నాయకానాయికలు చేసే పని. కానీ అప్పట్లో అలా లేదు. కష్టానికి తగ్గ భోజనం తీసుకునేవారు. నచ్చిన ఫుడ్‌ను లాగించేవారు. అంతే కాదు అప్పుడప్పుడు సెట్‌కి ఇతర నటీనటులు తెచ్చే భోజనాన్ని కూడా ఆస్వాదించేవారు. అయితే అప్పట్లో సూపర్‌స్టార్ కృష్ణ వంటి వారు ఆరోగ్యకరమైన ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యతీ ఇచ్చేవారు. ఆహారపు అలవాట్లలో కృష్ణ తీరు వేరుగా ఉంటుంది. కృష్ణ (Superstar krishna) షూటింగ్ లేని సమయంలో ఇంట్లోనే ఉండేవారు. ఆయన భవంతిలోని పై గదిలోనే ఉండేవారు. కరెక్ట్‌గా గంట కొట్టినట్లు 12.30 గంటలకు కింద ఉన్న డైనింగ్ హాల్‌కు వచ్చి కూర్చోనేవారు. ఇంట్లో ఎన్ని ప్రత్యేకమైన వంటకాలు ఉన్నా ఆయన మాత్రం సెలెక్టివ్‌గా, మితమైన ఆహారాన్ని తీసుకునేవారు. ఆయనతో జర్నీ చేసిన రచయితలు కో ఆర్టిస్ట్‌లు చాలామంది ఇలా చెబుతుంటారు. ఆయనతో గూఢచారి 117 వంటి సినిమాలకు పనిచేసిన రచయిత తోటపల్లి మధు.. కృష్ణ ఫుడ్ హ్యాబెట్స్ విషయంలో ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేశారు. (Thotapalli madhu)
"కృష్ణగారు చాలా సింపుల్ పర్సన్. చాలా తక్కువ మాట్లాడతారు. అయితే ఆయన మాటలు గమ్మత్తుగా ఉంటాయి. ఉదయాన్నే ఇంట్లో టిఫిన్ పూర్తి చేసుకుని సెట్‌కి బయలుదేరేవారు. 11 గంటలకు మన పెరుగు ఆవడ వాడు రాలేదా అని అడిగేవారు. అప్పట్లో షూటింగ్‌ల్లో పెరుగు ఆవడ ఇచ్చేవారు. పైన బూందీ వేసి రుచిగా ఉండేది. లంచ్‌కు ఉదయానికి మధ్య గ్యాప్‌లో ఇది ఇవ్వటంతో కృష్ణగారు ఈ ఐటం కోసం అడిగేవారు. ఒంటిగంట లంచ్ కు వెళ్లి 3 గంటలకు వచ్చేవారు. ఓ అరగంట మాట్లాడుతూ సున్నుండలు వాడు రావాలే అనే వారు. వచ్చాక అవి తినేవారు. మళ్లీ ఐదున్నరకు వీట్ దోస అని వేలు మణి హోటల్ నుంచి వచ్చేది. అవి మద్రాస్ స్టైల్‌లో ఉండేవి. అవి తీసుకొనేవారు. అప్పటి ప్రొడ్యూసర్స్ ఇవన్నీ మెయింటైన్ చేసేవారు. ఆయన ఎన్ని తిన్నా బ్రహ్మాండంగా ఉండేవారు. ఎక్కడా బరువు పెరిగేవారు కాదు. ఆయనది మంచి ఫిజిక్’’’ అని తోటపల్లి మధు అన్నారు.
"బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే భోజనం రాజభోజనంలా, మధ్యాహ్న భోజనం సామాన్యుడి భోజనంలా, రాత్రి భోజనం పేదవాడి భోజనంలా ఉండటం ఆరోగ్యకరమైన అలవాటు అని చెప్పేవారు. బాలెన్స్‌డ్ డైట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన నీళ్లు ఎక్కువగా తాగేవారు. అందుకే ఆయన ఎప్పుడూ షూట్ లో ప్రెష్ గా ఉండేవారంటారు. ప్రతిరోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగే వారు. మార్కెట్‌లో తేలికగా దొరకే జంక్‌ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకునేవారు కాదు. సెట్ లో మిగతా వాళ్లు తింటున్నా.. ఆయన ఆసక్తి చూపించేవారు కాదు" అని తోటపల్లి మధు చెప్పారు. అయన ఆహార అలవాట్లు కొల పద్ధతిలో ఉండేవి కాబట్టే అయన ఎపుడు... నాజూకుగా ఉండేవారు.