Sukumar: ‘అతడు లేకుండా సినిమాలు చేయలేను’

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:10 PM

'ఆర్య' నుంచి 'పుష్ప 2' వరకు సుకుమార్ సినిమాలో ఒక కామన్ థింగ్ కనిపిస్తుంది. ఆయన దాన్ని ఛేంజ్ చేసే సాహసం కూడా ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అది మూవీ సక్సెస్ లో కీలకం..

'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్.. బుచ్చి బాబు ప్రాజెక్ట్ తోపాటు సుకుమార్ తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మరోవైపు సుకుమార్ 'పుష్ప 2' గ్రాండ్ సక్సెస్ తర్వాత చరణ్ తో సినిమా చేయనుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో కాస్టింగ్, టెక్నీషియన్స్ పై ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే సుకుమార్ చేసిన కామెంట్స్ ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని హింట్స్ ఇచ్చేశాయి. ఇంతకు సుకుమార్ ఏమన్నాడంటే..


'ఆర్య' నుంచి 'పుష్ప 2' వరకు సుకుమార్ సినిమాలో ఒక కామన్ థింగ్ కనిపిస్తుంది. ఆయన దాన్ని ఛేంజ్ చేసే సాహసం కూడా ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అది మూవీ సక్సెస్ లో కీలకం అవుతూ వస్తోంది. ఇంతకు ఆ కామన్ థింగ్ ఏంటంటే.. మ్యూజిక్ డైరెక్టర్. బన్నీతో పాటు సుకుమార్, దేవిశ్రీప్రసాద్ ల స్నేహం కూడా ఎంతో ప్రత్యకమైనది. డీఎస్పీ లేకుండ సుక్కూ మార్క్ అసంపూర్ణంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఏంటి సుకుమార్, రామ్ చరణ్ సినిమాకు డీఎస్పీ పనిచేస్తున్నాడా అంటే.. అవును. తాజాగా జరిగిన 'పుష్ప 2' థ్యాంక్స్ మీట్ లో ఆయన సుక్కు మాట్లాడుతూ.. " నేను ఇప్పటి వరకు దేవి మ్యూజిక్ లేకుండ సినిమా చేయలేదు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లోను అదే కంటిన్యూ అవుతోంది." అంటూ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లోను డీఎస్పీ అని పరోక్షంగా చెప్పేశాడు.

DSP.jpg


భారీ అంచనాలు

ఇటీవల రాజమౌళి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న సినిమాలో ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుంది. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్‌ సీన్‌ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్‌ ఎడ్జ్‌కు వచ్చేస్తారని నమ్మకంగా చెప్పగలను’ అని అన్నారు. అలాగే రాజమౌళి తనయుడు కార్తికేయ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ షూటింగ్‌ సమయంలో సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు రామ్‌ చరణ్‌ చెప్పారు. ఆ సినిమాలో ఓపెనింగ్‌ సీన్‌ గురించి వివరించాడు. అది ఐదు నిమిషాలు ఉంటుందని.. అదొక అద్భుతమని తెలిపారు. నాటి నుంచి ఈ సినిమా ప్రకటన కోసం నేను ఎదురుచూస్తూనే ఉన్నా. ఈ మూవీ వీళ్లిద్దరి కెరీర్‌లోనే మైలురాయి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ లీక్‌ చేయలేను’ అని రాసుకొచ్చారు. 'రంగస్థలం’ సూపర్‌ హిట్‌ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఆర్‌సీ 17 చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. రాజమౌళి, కార్తికేయల కామెంట్స్‌తో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.

Updated Date - Feb 09 , 2025 | 04:15 PM