SSMB29 Memes: మహేశ్‌పై మీమ్స్.. ప్రియాంక ఫిక్స్
ABN , Publish Date - Jan 25 , 2025 | 02:30 PM
ఇన్‌స్టా వేదికగా దర్శకుడు రాజమౌళి వీడియోను పంచుకున్నారు. అందులో సింహాన్ని బోనులో బంధించినట్లు, పాస్‌పోర్ట్ చూపిస్తూ కనిపించారు. శుక్రవారం రాత్రి రాజమౌళి ఈ పోస్ట్ చేయగా, శనివారం ఉదయానికి వైరల్‌గా మారింది.
మహేశ్‌బాబు (Mahesh Babu) ఫాన్స్ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇస్తూ ఇన్‌స్టా వేదికగా దర్శకుడు రాజమౌళి వీడియోను పంచుకున్నారు. అందులో సింహాన్ని బోనులో బంధించినట్లు, పాస్‌పోర్ట్ చూపిస్తూ కనిపించారు. శుక్రవారం రాత్రి రాజమౌళి ఈ పోస్ట్ చేయగా, శనివారం ఉదయానికి వైరల్‌గా మారింది. సోషల్ మీడియా అంతా.. మహేశ్ కొత్త సినిమాకు సంబంధించిన పోస్టులు, మీమ్స్‌తో సందడి చేయడం మొదలైంది. మహేశ్‌బాబు ఫ్యామిలీ మ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ మాత్రం కాస్త ఖాళీ దొరికినా కుటుంబంతో కలిసి, విహారయాత్రకు విదేశాలకు వెళ్లిపోతుంటారు. రాజమౌళి సినిమా అంటే కీలక నటీనటులు, సాంకేతిక నిపుణులకు మరో కమిట్‌మెంట్ ఉండదు. ఆయన సినిమా పూర్తయ్యే వరకూ మరో సినిమా చేసే అవకాశమూ ఉండదు. అంతలా డెడికేషన్ పెట్టాల్సిందే.
Also Read- Akhanda 2 Thandavam Heroine: ప్రగ్యా జైస్వాల్ ఏమైంది.. ఇదేం ట్విస్ట్ బోయపాటి?
మహేశ్‌బాబు పాస్‌పోర్ట్ ఇప్పుడు రాజమౌళి చేతుల్లో ఉందంటే, సినిమా షూట్ పూర్తయ్యేవరకూ ఆయన లాక్ అయినట్లే. సింహాన్ని బంధించినట్లు వీడియోను క్రియేట్ చేశారు. ఇక బ్యాగ్రౌండ్‌లో ‘స్పైడర్’ మూవీలో మ్యూజిక్‌ను వాడారు. ఇండస్ట్రీలో అందరూ రాజమౌళిని పని రాక్షసుడు అంటారు. ‘స్పైడర్’లో ఎస్‌జే సూర్యలా నవ్వుతూ ‘ఇక చూడండి.. నా ఆట ఎలా ఉంటుందో’ అన్నట్లు పెట్టిన ఎక్స్‌ప్రెషన్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. పాస్‌పోర్ట్ కోసం మహేశ్‌బాబు పడే తిప్పలను ఫన్నీ మీమ్స్ ద్వారా అభిమానులు షేర్ చేస్తున్నారు. (Memes Viral)
ప్రియాంక ఫిక్స్ అయినట్లే..
రాజమౌళి పెట్టిన పోస్టుకు, మహేశ్ స్పందించారు. 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అంటూ మహేశ్ పోస్ట్ చేశారు. దీనికి ప్రియాంక చోప్రా ‘ఎట్టకేలకు..’ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఈ మూవీలో మహేశ్‌బాబు తర్వాత అధికారికంగా ప్రకటించిన నటిగా ప్రియంకాచోప్రా నిలిచారు.