SSMB 29: ఆ దేశంలో 'ఎస్ఎస్ఎంబీ 29' షూటింగ్
ABN , Publish Date - Jan 26 , 2025 | 09:27 PM
SSMB 29: జక్కన్నతో పాటు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ నేషనల్ పార్క్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందని సమాచారం. కానీ..
ఇది కేవలం ఒక హీరో ఫ్యాన్స్, ఒక ఇండస్ట్రీ, ఒక దేశం ఎదురుచూస్తున్న సినిమా కాదు. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'SSMB 29'. దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో ప్రపంచానికి భారతీయ సినిమా సత్తా ఏంటో నిరూపించిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మహేష్ బాబుని లాక్ చేసిన జక్కన ఈ సినిమా షూటింగ్ ఫారిన్ లో షురూ చేసినట్లు తెలుస్తోంది. కానీ.. ఒక్కటి తక్కువైంది. అదేంటంటే..
గుట్టుచప్పుడు కాకుండా రాజమౌళి ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇది పక్కనా పెడితే ఆయన గతేడాది అక్టోబర్‌లో కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ ని సందర్శించారు. అక్కడ 'SSMB 29' షూట్ కి ప్లాన్ కూడా చేశారు. తాజాగా మూవీ టీమ్ అంతా కెన్యాకు బయలుదేరినట్లు తెలుస్తుంది. జక్కన్నతో పాటు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అంబోసెలి నేషనల్ పార్క్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందని విశ్వసనీయ సమాచారం. కానీ.. ప్రస్తుతానికి మహేష్ బాబు సన్నివేశాలను తెరకెక్కించలేదని తెలుస్తోంది. మరోవైపు అనుకున్న దానికంటే ముందే మూవీ స్టార్ట్ కావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
మరికొందరి నిరాశ..
ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గాదాదాపుగా ఖాయమైపోయినట్లు తెలుస్తుంది . అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఆమె ఈ సినిమాలో ఫైనల్ అయినట్లు శనివారం ఆమె చేసిన పోస్ట్‌తో దాదాపు ఖాయమైనట్లే అని తెలుస్తోంది. రాజమౌళి అన్ని రకాలుగా ఆలోచించే ప్రియాంకాను ఫైనల్ చేశారని టాక్. అయితే ప్రియాంక రాక ప్రిన్స్ ఫ్యాన్స్‌కు ఏ మాత్రం నచ్చట్లేదని టాక్ నడుస్తోంది. మహేష్ పక్కన ప్రియాంక చాలా ముదురుగా కనిపిస్తుందన్నది అభిమానుల వాదన. ప్రియాంక వయసు 42. మహేష్ తో పోలిేస్త ఏడేళ్లు చిన్నదే. కాకపోతే ఈ జోడీ అంత చూడ ముచ్చటగా ఉండదన్నది హీరో ఫ్యాన్స్ భయం. ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ ఈ కాంబో గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రియాంక కంటే మంచి హీరోయిన్‌ని వెదికి పట్టుకోవాల్సింది కదా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.