Seize The Lion: జక్కన్న బోనులో మహేశ్.. నో మోర్ వెకేషన్స్
ABN , Publish Date - Jan 25 , 2025 | 07:08 AM
రాజమౌళి, మహేష్ బాబు పాస్‌పోర్ట్‌ను తీసుకుని ఇక.. నో మోర్ వెకేషన్స్ అన్నట్లు ఓ వీడియో షేర్ చేశారు.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, (Mahesh Babu) జక్కన్న బోనులో (SS Rajamouli) బంధి అయ్యారు. ఇక కొన్నాళ్లపాటు ఆయన హ్యాండవర్‌లోనే మహేశ్ ఉండాలి. అందుకే ఆయన పాస్‌పోర్ట్‌ను తీసుకుని ఇక.. నో మోర్ వెకేషన్స్ అన్నట్లు ఓ వీడియో షేర్ చేశారు. ఈ మేరకు దర్శకుడు రాజమౌళి ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. సింహాన్ని లాక్ చేసినట్లు అర్థంవచ్చేలా (Seize The Lion) ఆ వీడియో ఉంది. పాస్‌పోర్ట్ చూపిస్తూ ఫొటోకు పోజ్ ఇచ్చారు. దీంతో 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) షూటింగ్ షూరు అయిందని, ఇప్పట్లో మహేశ్‌కి అబ్రాడ్ వెకేషన్స్ లేవని తెలుస్తోంది. రాజమౌళి పోస్ట్‌కు మహేశ్ స్పందించారు. 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అంటూ ఇన్‌స్టా పోస్ట్‌కు కామెంట్ చేశారు. దీనిపై నమ్రత కూడా స్పందించారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మహేశ్‌బాబు - ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ భారీ యాక్షన్ ఎంటన్‌టైనర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.