SSMB29: టైటిల్‌ కోసం కసరత్తులు మొదలు...

ABN , Publish Date - Feb 08 , 2025 | 02:13 PM

మహేష్‌ బాబు, ప్రియాంకా చోప్రాలపై ఓ కీలకమైన సన్నివేశాన్ని 5 రోజులపాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌ లో తీర్చిదిద్దారు. తదుపరి షెడ్యూల్‌ కూడా త్వరలోనే మొదలు కానుంది.

మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహిస్తున్న 'ఎస్‌ఎస్‌ఎంబీ29’ (SSMB29) చిత్రం షూటింగ్‌ సైలెంట్‌గా మొదలైంది. ఇప్పటికే మహేష్‌ బాబు, ప్రియాంకా చోప్రాలపై ఓ కీలకమైన సన్నివేశాన్ని 5 రోజులపాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌ లో తీర్చిదిద్దారు. తదుపరి షెడ్యూల్‌ కూడా త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్రలో నానా పటేకర్‌ కనిపించబోతున్నారని టాక్‌. ఆయనపై కూడా లుక్‌ టెస్ట్‌ నిర్వహించారని ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో మహేష్‌ తండ్రి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. ఆ పాత్ర కోసం ఎవరిని ఎంచుకొంటారా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. నానా పటేకర్‌ని (Nanaa patekar) తీసుకొంది మహేష్‌ తండ్రి పాత్ర కోసమా? కాదా? అనేది తెలియాల్సి ఉంది. మరో పక్క ఈ సినిమా టైటిల్‌ కోసం రాజమౌళి అన్వేషణ మొదలైంది.


‘మహారాజ్‌’ (Maharaj), ‘గరుడ’ (Garuda) అనే టైటిల్స్‌ ఈ సినిమా కోసం పరిశీలించారని టాక్‌ నడిచింది. ఇవి రెండూ ఇప్పుడు ఓల్డ్‌ టైటిళ్లు అయిపోయాయి. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ‘జనరేషన్‌’ (Generation) అనే అర్థం వచ్చేలా ఓ పాన్‌ వరల్డ్‌ టైటిల్‌ కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. ఈ కథకు తరతరాల లింక్‌ ఉంది. అందుకే అలాంటి టైటిల్‌ యాప్ట్‌ అని భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఏ విషయాన్నీ రాజమౌళి బయటకు రానివ్వడం లేదు. ప్రియాంక చోప్రాని ఎంచుకున్న సంగతి కూడా అధికారికంగా ప్రకటించలేదు. మీడియాలో ఎన్ని కథనాలు వచ్చిన రాజమౌళి అండ్‌ కో నుంచి ఎలాంటి స్పందన లేదు.  

Updated Date - Feb 08 , 2025 | 02:13 PM