SS Rajamouli Love story: యాంకర్‌తో రాజమౌళి లవ్‌స్టోరీ.. సీన్‌ మామూలుగా లేదు..

ABN , Publish Date - Feb 19 , 2025 | 02:25 PM

దర్శకుడు రాజమౌళికి  ఓ లవ్ ట్రాక్‌ (Rajamouli Love track) ఉంది. అది ఎవరితో అనుకుంటున్నారా? ఇప్పటి పాపులర్‌, హాట్‌ యాంకర్‌తో. వీరిద్దరికీ లవ్‌ స్టోరీ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి..

టాలీవుడ్‌ అగ్ర దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) సినిమాల్ని డైరెక్ట్‌ చేయడమే కాదు.. ఆయన తీసే సినిమాల్లో అప్పుడప్పుడు ఏదో ఒక మూలన అతిథి పాత్రలో మెరుస్తుంటారు. సై’, ‘మజ్ను’, ‘బాహుబలి’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి చిత్రాల్లో ఆయన కనిపించిన సంగతి తెలిసిందే. సినిమాల్లోనూ కాదు గతంలో ఓ సీరియల్‌లోనూ (Yuva Seriel) )ఆయన నటించారు. దీనికి సంబంధించిన రేర్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. అందులో ఆయనకో లవ్‌ ట్రాక్‌ (Rajamouli Love track) ఉంది. అది ఎవరితో అనుకుంటున్నారా? ఇప్పటి పాపులర్‌, హాట్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌తో. వీరిద్దరికీ లవ్‌ స్టోరీ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి..

rajamouli and reshmi.jpg


నాకు సిగ్గుగా ఉంది(రష్మి) .. నాకు తొందరగా ఉంది (రాజమౌళి)

ఇప్పుడు స్టార్‌ యాంకర్‌గా, నటిగా కొనసాగుతున్న రష్మీ కెరీర్‌ బిగినింగ్‌లో టీవీ సీరియల్స్‌ కోసం వర్క్‌ చేసింది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన సీరియల్‌ ‘యువ’. అప్పట్లో ట్రెండ్‌ సృష్టించిన ఈ  సీరియల్‌లో రాజమౌళి గెస్ట్‌ రోల్‌లో కనిపించారు. ఇందులో రాజమౌళి – రష్మీపై ఒక సరదా లవ్‌ ట్రాక్‌ ఉంటుంది. ‘ఐ లవ్‌ యూ’ అంటూ ఆమె తన మనసులోని మాట చెబుతుంది. అందులో రష్మి రేడియో జాకీగా పని చేస్తుంది. రాజమౌళి రేడియో వ్యూవర్‌గా రోజు గంటలపాటు మాట్లాడటంతో లవ్‌ పుట్టికొస్తుంది. అది ఎంత వరకూ వెళ్లింది అనేది ట్రాక్‌. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వండర్‌గా ఫీల్‌ అవుతున్నారు. వీరిద్దరూ ఎప్పుడు నటించారు? ఇదెప్పుడు జరిగిందంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. మరికొందరేమో ఇది నిజం కాదని.. ఏఐ జనరేటెడ్‌ వీడియో అని కామెంట్స్‌ చేస్తున్నారు.  


అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన రాజమౌళి ‘శాంతి నివాసం’ అనే సీరియల్‌తో దర్శకుడిగా మారారు. తదుపరి ఆయన స్టూడెంట్‌ నం.1’తో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు. అక్కడి నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకూ జక్కన్న సాధించిన ఘనత అందరికీ తెలిసిందే! ప్రస్తుతం ఆయన మహేశ్‌బాబు ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ చేస్తున్నారు. ఇండియన్‌ స్ర్కీన్‌పై ఇప్పటి దాకా చూడని ఓ కొత్త కథతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటీనటులు కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెలలో చిత్రీకరణ మొదలైంది. 

Updated Date - Feb 19 , 2025 | 06:53 PM