SS Rajamouli Demand: కీరవాణి కాన్సెర్ట్.. రాజమౌళి డిమాండ్
ABN , Publish Date - Feb 28 , 2025 | 11:49 PM
ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli Demand) తన డిమాండ్ వినిపించారు. అభిమానులు సపోర్ట్ కోరారు. ఇంతకీ రాజమౌళి డిమాండ్ ఏంటంటే..
‘నా టూర్ ఎం.ఎం.కె’ (Naa Tour MMK) పేరిట ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి (MM keeravani) లైవ్ కాన్సర్ట్ చేయనున్నారు. మార్చి 22న సాయంత్రం 7గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఆ వేడుక ప్రారంభం కానుంది. సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలు పంచుకుంటూ ఆయన సోదరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli Demand) తన డిమాండ్ వినిపించారు. అభిమానులు సపోర్ట్ కోరారు. ఇంతకీ రాజమౌళి డిమాండ్ ఏంటంటే..
‘‘మార్చి 22 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆ రోజు ‘నా టూర్ ఎం.ఎం.కె’ కాన్సర్ట్ ఉంది. అన్నయ్య సంగీతం అందించిన నా చిత్రాల్లోని పాటలు, వేరే సినిమాల్లోని పాటల ప్రదర్శనలుంటాయి. కానీ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఉండాలనేది నా డిమాండ్. ఎందుకంటే ఆయన రీ రికార్డింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లను ఆయన లైవ్‌లో ప్లే చేయాలని కోరుకుంటున్నా. ఓఎస్‌టీ కావాలనే నాతో మీరూ జాయిన్ అవ్వండి’’ అని రాజమౌళి అభిమానులకు విజ్ఞప్తి చేశారు.