Sree Vishnu: ఐటెమ్ ఫిక్స్ అయినట్టేనా..
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:26 PM
శ్రీవిష్ణు (Sree Vishnu) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. 'స్వాగ్' చిత్రం తర్వాత ఆయన నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ మీదున్నాయి. అయన నటిస్తున్న తాజా చిత్రానికి టైటిల్ ఖరారు అయినట్లు సమాచారం
శ్రీవిష్ణు (Sree Vishnu) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. 'స్వాగ్' చిత్రం తర్వాత ఆయన నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ మీదున్నాయి. గీత ఆర్ట్స్ నిర్మాణం, కార్తిక్ దర్శకత్వంలో 'సింగిల్’ (Single) సినిమా చేస్తున్నారు. ‘మృత్యుంజయ్’ (Mrithunjay) అనే ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. దీనికి హుస్సేన్ కిరణ్ దర్శకుడు. ఇవి కాకుండా స్వాతిముత్యం ఫేం డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ అయ్యింది. 'ఐటమ్’ (Item)అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ చేస్తున్నారని తెలిసింది. దాదాపు ఇదే టైటిల్ ఫైనల్ కావచ్చని చిత్ర బృందం నుంచి టాక్ వస్తోంది.
స్వాతిముత్యం మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ సినిమా థియేటర్స్‌లో పెద్దగా ఆడలేదు కానీ ఓటీటీలోకి వచ్చాక అందులో విపరీతంగా ఆకట్టుకుంది. అందులో వినోదాన్ని ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఐటమ్ కూడా హోల్సమ్ ఎంటర్‌టైన్మెంట్‌తోనే రూపొందుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలోనే అఫీషియల్‌గా టైటిల్‌ను ప్రకటిస్తారు.