Sree Vishnu: మరోసారి 'సామజవర గమన' జోడీ!
ABN , Publish Date - Feb 28 , 2025 | 01:05 PM
ఫిబ్రవరి 28 శ్రీవిష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని తాజా చిత్రం టైటిల్ టీజర్ విడుదలైంది. 'సామజవర గమన' మూవీ తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్ ఇందులో మరోసారి కలిసి నటిస్తున్నారు.
కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu) ఎప్పుడూ భిన్నమైన చిత్రాలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తుంటాడు. అయితే అవి ఒక్కోసారి వర్కౌట్ అవుతున్నాయి. మరికొన్ని సార్లు నిరాశ పర్చుతున్నాయి. అయితే... ఏదో ఒక వర్గం ఆడియెన్స్ ను మాత్రం శ్రీ విష్ణు మెప్పిస్తూనే ఉన్నాడు. శ్రీవిష్ణుకు సాలీడ్ హిట్ అంటే... 2023లో వచ్చిన 'సామజవర గమన' చిత్రమే! ఆ తర్వాత ఆ స్థాయి హిట్ ను అతను అందుకోలేదు. గత యేడాది శ్రీవిష్ణు నటించిన 'ఓం భీమ్ బుష్', 'స్వాగ్' చిత్రాలు విడుదలయ్యాయి. అందులో మొదటిది హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన కామెడీ చిత్రం. ఇక 'స్వాగ్' రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నమైంది. ఈ నేపథ్యంలో విష్ణు ఇప్పుడో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 28 వెర్సటైల్ హీరో శ్రీవిష్ణు పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని తాజా చిత్రం టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం (Sandeep Gunnam), వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు. రెబా జాన్ (Reba John) హీరోయిన్ గా నటిస్తోంది. 'సామజవర గమన' తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్ జంటగా నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు 'మృత్యుంజయ్' అనే పేరు ఖరారు చేశారు. తాజాగా విడుదలైన టైటిల్ టీజర్ లో చిత్రంలోని నటీనటులతో పాటు శ్రీవిష్ణుని ఇన్వెస్టిగేటర్‌గా, ఖైదీగా చూడొచ్చు. చివర్లో ‘నేను చెప్పే వరకు గేమ్ ఫినిష్ కాదు’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మృత్యుంజయ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మనీషా.ఎ.దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
Also Read: Ram Pothineni: నిన్న విశ్వక్... నేడు రామ్... భలే ఉంది వరుస!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి