Sai Pallavi: సాయి పల్లవి పేరు చెబితే ఎవరైనా అనేది ఒకటే...

ABN , Publish Date - Feb 09 , 2025 | 08:11 AM

ఆమె పేరు చెబితే ఎవరైనా అనేది ఒకటే... అరుదైన నటి, ఇలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదు.. ఇవే చెబుతారు. నాగచైతన్యతో ‘తండేల్‌’ చేసిన ఈ నేచురల్‌ బ్యూటీ టాలెంట్‌, వ్యక్తిత్వం గురించి... ఆమెతో ఇప్పటిదాకా కలిసి పనిచేసిన కథానాయకులు ఏం చెబుతున్నారంటే.

తక్కువ సినిమాల్లో నటించినా... ఎక్కువగా గుర్తుండిపోయే పాత్రల్లో అలరించింది సాయిపల్లవి(Sai Pallavi). ఆమె పేరు చెబితే ఎవరైనా అనేది ఒకటే... అరుదైన నటి, ఇలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదు.. ఇవే చెబుతారు. నాగచైతన్యతో ‘తండేల్‌’ చేసిన ఈ నేచురల్‌ బ్యూటీ టాలెంట్‌, వ్యక్తిత్వం గురించి... ఆమెతో ఇప్పటిదాకా కలిసి పనిచేసిన కథానాయకులు ఏం చెబుతున్నారంటే.. (Heros about Sai pallavi)

Naga.jpg
తనతో డ్యాన్సంటే కంగారే

పల్లవితో నటించాలన్నా, డ్యాన్స్‌ చేయాలన్న నాకు కంగారు వచ్చేస్తుంది . ఒకరకంగా నా డ్యాన్స్‌ మెరుగుపడటానికి తనూ ఒక కారణమే. నన్నెంతో ప్రోత్సహించింది. కేవలం తన క్యారెక్టర్‌ వరకే కాకుండా... సినిమాని మొత్తంగా ఒక స్ర్కిప్ట్‌ లెవల్లో చూస్తుంది. ఏదైనా సీన్‌ పూర్తికాగానే వెంటనే మానిటర్‌ దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సన్నివేశం బాగా వచ్చిందో, లేదో చూసి... ఒక ప్రేక్షకురాలిగా అక్కడే రివ్యూ ఇచ్చేస్తుంది. అంత డెడికేషన్‌ ఉన్న ఆర్టిస్టు.
- నాగచైతన్య (Naga chaitanya)


Shawra.jpg

గుడి అంటే చాలు...
పల్లవి నాకొక మంచి ఫ్రెండ్‌. తనకి భక్తి ఎక్కువ. గుడికి వెళదాం అంటే చాలు.. ఏమీ అడగకుండా వచ్చేస్తుంది. ‘పడిపడి లేచె మనసు’ సమయంలో ఇద్దరం కలిసి చాలా గుళ్లకు వెళ్లాం. ఏదైనా సీన్‌ చేసేటప్పుడు దాన్ని ఇంకా బాగా ఎలా చేయొచ్చో చర్చించుకొని మెరుగులు దిద్దేవాళ్లం. నా దగ్గరకి వచ్చిన స్క్రిప్ట్స్  తనకి పంపిస్తే, చదివి బాగుందా లేదా చెప్పేస్తానని అంటుంది. తన జడ్జ్‌మెంట్‌ బాగుంటుంది.
- శర్వానంద్‌ (Sharwanand)

Suriya.jpg

అరుదైన నటి
నా కెరీర్‌లో సాయిపల్లవి లాంటి నటిని ఇప్పటిదాకా చూడలేదు. కొన్ని సన్నివేశాల్లో ఆమె హావభావాలు చూసి... అంత సహజంగా ఎలా నటిస్తోందని ఆశ్చర్యపోయేవాడిని. ఒక సన్నివేశాన్ని ఎంత గొప్పగా పండించినా సరే, మరింత మెరుగ్గా చేయాలనే తపనతో ఉంటుంది. తన కారణంగానే ఇతరుల సమయం వృఽథా అవుతుందని, షూటింగ్‌ ఆలస్యం అవుతుందని ఒక్కోసారి కన్నీరు పెట్టుకునేది. నటన పట్ల అంకితభావం ఉన్న ఇలాంటి నటీమణులు చాలా అరుదు.
- సూర్య (Suriya)


Nani.jpg

వందసార్లు సారీ చెప్పేది

నన్ను అందరూ ‘హీరోలా కాదు ఇంట్లో మనిషిలాగ అనిపిస్తావ’ని అంటుంటారు. సరిగ్గా అలాంటి ఫీలింగ్‌ నాకు సాయిపల్లవిని చూస్తే కలుగుతుంది. నిజంగా తను హైబ్రీడ్‌ పిల్లే. తన అత్యద్భుత సహజ నటనతో ఎవరినైనా ఇట్టే ఫిదా చేసేస్తుంది. ‘శ్యామ్‌సింగరాయ్‌’లోని ఓ పాటలో తను డ్యాన్స్‌ చేస్తూంటే నేను ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోవాలి. అదీ సీన్‌. కానీ షూటింగ్‌ అని మర్చిపోయి నిజంగానే తన డ్యాన్స్‌ని నేను కళ్లార్పకుండా చూస్తుండిపోయా. అంతలా మాయ చేసేసింది. సెట్స్‌లో నా డైలాగ్‌ పూర్తవ్వకుండానే తను డైలాగ్‌ చెబితే... దానికి వందసార్లు సారీ చెప్పేది.                      

-నాని (nani)

Siva.jpg

అన్నా’ అనేసింది
సాయిపల్లవికి, నాకు ఇది వరకే పరిచయం ఉంది. గతంలో ఓ టీవీ ఛానల్‌లో నేను వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. కొంతకాలం తర్వాత తను నటించిన ‘ప్రేమమ్‌’ చూడటానికి థియేటర్‌కు వెళ్లాను. స్క్రీన్ పై  పల్లవి కనిపించిన ప్రతీసారి ‘మలార్‌ టీచర్‌’ అంటూ ఒకటే అరుపులు. భలే ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే తనకు ఫోన్‌ చేసి ప్రశంసించాను. ‘థాంక్యూ అన్నా’ అని ఉత్సాహంగా బదులిచ్చింది. తను నన్ను అన్నా అని పిలిచినందుకు అప్పట్లో కాస్త ఫీలయ్యాను.
- శివ కార్తికేయన్‌ (Shiva karthikeyan)

Updated Date - Feb 09 , 2025 | 08:38 AM