Mazaka: రీతు అందానికి సొమ్మసిల్లి పోతున్న సందీప్

ABN , Publish Date - Feb 22 , 2025 | 10:58 AM

సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటిస్తున్న 'మజాకా' సినిమా ఈ నెల 26న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీని నుండి మరో మాస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

యువ కథానాయకుడు సందీప్ కిషన్ (Sundeep Kishan) నటిస్తున్న 30వ చిత్రం 'మజాకా' (Mazaka) . శివరాత్రి (Maha Shivaratri) కానుకగా ఈ సినిమాను ఫిబ్రవరి 26న విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన చివరి పాటను వికారాబాద్ లో చిత్రీకరించారు. పాట చిత్రీకరణ కార్యక్రామాన్ని వివిధ టీవీ ఛానెల్స్ ద్వారా లైవ్ లో ప్రసారం చేశారు కూడా. రీతువర్మ (Ritu Varma) నాయికగా నటిస్తున్న ఈ మూవీలో 'సొమ్మసిల్లి పోతున్నావే' అనే పాటను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) దర్శకత్వంలో రాజేశ్‌ దండా, ఉమేశ్ కె.ఆర్. బన్సాల్ నిర్మిస్తున్నారు. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ, కథనం, సంభాషణలు సమకూర్చారు. విశేషం ఏమంటే 'సొమ్మసిల్లి పోతున్నావే' పాట ఇప్పటికే ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా ప్రజాదరణ పొందింది. దానిని న్యూజనరేషన్ శ్రోతల కోసం రీఇన్వెంట్ చేశామని 'మజాకా' మేకర్స్ తెలిపారు. ఈ జానపద గీతానికి కొత్త ట్విస్ట్ ఇస్తూ హై ఎనర్జీని యాడ్ చేస్తూ రాము రాధోడ్, ప్రసన్న కుమార్ బెజవాడ సాహిత్యం సమకూర్చారు. దీనిని రేవంత్ హై ఎనర్జీ వోకల్స్ తో పాడారు. మోయిన్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీని అందించారు. ఈ సినిమాలో మరో జంటగా రావు రమేశ్, అన్షు నటించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'మజాకా' ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Updated Date - Feb 22 , 2025 | 10:58 AM