Sampoornesh Babu: వినరా సోదర వింతగాథ...
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:48 PM
సంపూర్ణేశ్ బాబు కొంతకాలంగా హీరో పాత్రలకు దూరంగా ఉంటున్నాడు. అయితే 'సోదరా' కథ నచ్చి ఈ సినిమాలో మరోసారి హీరోగా నటించాడు.
గత కొంతకాలంగా సంపూర్ణేష్ బాబు హీరో పాత్రలకు దూరంగా ఉంటూ అవకాశం వచ్చినప్పుడు మాత్రమే కామెడీ రోల్స్ చేస్తున్నాడు. అయితే... తాజాగా 'సోదరా' అనే అన్నదమ్ముల అనుబంధాన్ని తెలిపే చిత్రంలో సంపూర్ణేశ్ బాబు, సంజోష్ బ్రదర్స్ గా నటించారు. ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చగంలా నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు.
'సోదరా' సినిమా గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ''అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్న చిత్రమే 'సోదరా'. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన నాలుగు పాటలకు మంచి స్పందన లభించింది. మా సినిమా ఈ వేసవికి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు. సంపూర్ణేష్ బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారని వారు చెప్పారు. 'సోదరా' చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.
Also Read: Santhana Prapthirasthu: కనులే చెబితే, మనసే వినదా అంటున్న చాందినీ చౌదరి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి