Allu Arjun: బన్నీ... అట్లీ... మధ్యలో శివకార్తికేయన్

ABN , Publish Date - Mar 06 , 2025 | 03:18 PM

ఒకరు వెయ్యి కోట్ల క్లబ్ లో తాజాగా చేరిన సౌత్ స్టార్ - మరొకరు తన హిందీ సినిమాతో వెయ్యి కోట్లు చూసిన తమిళ డైరెక్టర్. ఇప్పుడు వీరిద్దరూ కలిస్తే 'రెండు వేల కోట్లు' అవుతుందా ఏంటని అనుకుంటున్నారు.

ఒకరు వెయ్యి కోట్ల క్లబ్ లో తాజాగా చేరిన సౌత్ స్టార్ - మరొకరు తన హిందీ సినిమాతో వెయ్యి కోట్లు చూసిన తమిళ డైరెక్టర్. ఇప్పుడు వీరిద్దరూ కలిస్తే 'రెండు వేల కోట్లు' అవుతుందా ఏంటని అనుకుంటున్నారు. ఏమో గుర్రం ఎగరావచ్చు. ఇంతకూ ఆ ఇద్దరు ఎవరంటారా!? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar). 'పుష్ప- ద రూల్' రిలీజై రికార్డులు కొట్టేయగానే బన్నీ తరువాతి సినిమా ఏంటనే చర్చ ఫ్యాన్స్ లో ఊపందుకుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ సినిమా అని కొందరు, కాదు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని ఇంకొందరు అన్నారు. వారిద్దరూ కాకుండా తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తో సాగడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకని బన్నీ అట్లీ వైపు మొగ్గాడు అన్న ప్రశ్నకు సరైన సమాధానమే వినిపిస్తోంది. అదేమిటంటే - అట్లీ దగ్గర బన్నీకి తగ్గ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందట! అంతేకాదు శరవేగంగా ఆ సినిమాను పూర్తి చేసేందుకు తగిన ప్రణాళికను కూడా అట్లీ రూపొందించుకున్నాడట. ఈ అంశాలు నచ్చడం వల్లే బన్నీ, అట్లీ సినిమాకు ఓటేసినట్టు సమాచారం. ఆ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి ఇద్దరిలో ఎవరు ముందుగా సబ్జెక్ట్ తయారు చేసుకుంటే వారి సినిమాలోనే బన్నీ నటించబోతాడనీ తెలుస్తోంది.


Atlee.jpg

అంతేకాదు, ఈ సినిమా కోసం ఇప్పటికే బన్నీ విదేశాలకు వెళ్ళి మేకోవర్ అయ్యాడట. అందులో భాగంగానే స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. ప్రస్తుతం బన్నీకి ఆల్ ఇండియాలో ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొనే అట్లీ కథను రూపొందించాట. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగానూ సిద్ధం చేయాలని అట్లీ తపిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రకు తమిళ హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan) ను ఎంపిక చేసుకున్నట్టూ తెలుస్తోంది. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో శివకార్తికేయన్ నటిస్తున్నాడు. సుధతో తన పార్ట్ మొత్తం ఏప్రిల్ లోగా చిత్రీకరించాలని శివకార్తికేయన్ కోరినట్టు సమాచారం. మే నుండి బన్నీ సినిమాలో తాను పాల్గొనబోతున్నానని శివకార్తికేయన్ సన్నిహితులకు చెప్పినట్టూ వినిపిస్తోంది. 'అమరన్'తో తెలుగునాట కూడా క్రేజ్ సంపాదించుకున్న శివకార్తికేయన్ బన్నీ సినిమాలో నటించడమంటే విశేషమే!

ఇదిలా ఉంటే బన్నీ - అట్లీ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Jhanvi Kapoor) నటిస్తోందట. ఆమెతో పాటు మరో ఐదుగురు విదేశీ అందాలభామలు కూడా బన్నీతో జోడీ కట్టనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏ విధంగా చూసినా, ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియెన్స్ ను టార్గెట్ చేసుకొనే అట్లీ తీసేలా ఉందని తెలుస్తోంది. మరి చకచకా షూటింగ్ జరిపేసి, ఈ చిత్రాన్ని ఎప్పుడు అట్లీ జనం ముందు నిలుపుతాడో చూడాలి.

Updated Date - Mar 06 , 2025 | 03:18 PM