Singer Mangli: పండుగ పాట కావాలి కానీ, పార్టీ పాట కాదు..
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:59 PM
ఇటీవల ఆమె కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడితో కలిసి అరసవల్లి సూర్యనారాయణుడి దేవాలయానికి వెళ్లారు. దీనిపై తెదేపా క్యాడర్‌తోపాటు. సామాజిక మాధ్యమాల్లో అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో మంగ్లీ బహిరంగ లేఖ రాశారు.
"ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనురాలిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయటం చాలా బాధాకరం. నా పాటకు రాజకీయ రంగు పులమొద్దు. ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదు. నాకు ఎలాంటి రాజకీయ అభిమతాలు, పక్షపాతాలు లేవు. నేను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కాను. ఒక సింగర్‌గా అన్నింటికన్నా పాటే నాకు ముఖ్యం ’’ అని మంగ్లీ (Singer Mangli) పేర్కొన్నారు. ఇటీవల ఆమె కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడితో కలిసి అరసవల్లి సూర్యనారాయణుడి దేవాలయానికి వెళ్లారు. దీనిపై తెదేపా క్యాడర్‌తోపాటు. సామాజిక మాధ్యమాల్లో అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో మంగ్లీ బహిరంగ లేఖ రాశారు. ‘‘దేవుడి కార్యక్రమానికి వెళ్తే నాపై రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయడం సరికాదు. నా పై జరుగుతున్న విష ప్రచారాన్ని చెప్పుకునేందుకు ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు వచ్చా. అరసవల్లిలో జరిగే రథసప్తమి వేడుకలకు నన్ను ఆహ్వానించినందుకు అదృష్టంగా భావిస్తున్నా. కార్యక్రమం అనంతరం సూర్య్ఘ భగవానుని ఆలయాన్ని దర్శించాలనుకున్న సందర్భంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుగారి కుటుంబం ఒక కళాకారిణిగా, ఒక ఆడబిడ్డగా నన్ను వాళ్ళతో పాటు ఆహ్వానించారు. దేవుని కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయటం అన్యాయం కాదా. (mangli Political Controversy )
2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు నాయకులు నన్ను సంప్రదిస్తే పాట పాడాను. నేను ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరినీ ఒక్క మాట అనలేదు. వైకాపా ఒక్కటే కాదు, అన్ని పార్టీల లీడర్‌లకు నేను పాటలు పాడాను కూడా. ఆ పార్టీకి పాట పాడటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయా. వైకాపాకు పాడినందుకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. నా పాట ప్రతి ఇంట్లో పండుగ పాట కావాలి కానీ, పార్టీ పాట కాకూడదన్నది నా అభిప్రాయం. 2024లో ఎన్నికల్లో ఏ పార్టీకీ నేను పాటలు పాడలేదు. ఒక కళాకారిణిగా గుర్తించి ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఆ ఛానల్ అధికారులు నన్ను సంప్రదించారు. మా ఇంటి ఇలవేల్పు శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎలాంటి అవకాశం వచ్చినా తిరస్కరించకూడదనే ఆ పదవిని కొనసాగించానే తప్ప ఎక్కడా బహిరంగంగా ప్రకటించుకోలేదు. నేను పాటను నమ్ముకునే వచ్చాను కాని పార్టీలు, పదవులను నమ్ముకొని రాలేదని వేడుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకి నేను పాట పాడను అన్నది అవాస్తవం. రాజకీయ లబ్థి కోసం నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థ్థానం ఉన్న లీడర్ ఆయన. 2019 ఎన్నికల్లో వీడియో క్లిప్పులతో నాపై విషప్రచారం చేస్తున్నారు" అని మంగ్లీ పేర్కొన్నారు