Singer Kalpana: ఆయన వల్లే ఇలా ఉన్నాను..
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:10 AM
తన భర్త ప్రసాద్ గురించి మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు కల్పన.
పని ఒత్తిడి తట్టుకోలేకే అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకున్నానని సింగర్ కల్పన (Kalpana Singer)చెప్పారు. రెండ్రోజుల క్రితం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంగతి తెలసిందే. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఇప్పటికే తన కూతురు తల్లి ఆరోగ్యంపై స్పందించారు. తాజాగా కల్పన ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. తన భర్త ప్రసాద్ గురించి మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని అందుకే టాబ్లెట్స్ వేసుకున్నట్లు చెప్పారు. (Singer Kalpana Suicide)
ఆమె మాట్లాడుతూ ‘‘మీడియాలో మా కుటుంబంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. దాని గురించి అందరికీ వివరణ ఇవ్వాలనుకుంటున్నా. నా భర్త, నేను, కుమార్తె సంతోషంగా జీవిస్తున్నాం. నేను 45 సంవత్సరాల వయసులో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర పట్టడం లేదు. దాని కోసం చికిత్స తీసుకుంటున్నాను. వైద్యులు సూచించిన ప్రిస్ర్కిప్షన్‌లో టాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకున్నాను. అందువల్లే స్పృహ తప్పి పడిపోయాను. నా భర్త సరైన సమయంలో స్పందించడం, కాలనీవాసులు, పోలీసుల సహాయం వల్ల నేను గట్టెక్కి మీ ముందు ఉన్నాను. త్వరలోనే మళ్లీ నా పాటలతో మిమ్మల్ని అలరిస్తాను. ఆయన సహకారం వల్లే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నాను. నా జీవితానికి బెస్ట్ గిఫ్ట నా భర్త. నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అంటూ వీడియోలో పేర్కొన్నారు. (Singer Kalpana Suicide)
సంగీత కుటుంబంలో పుట్టిన కల్పనకు చిన్నప్పటి నుంచి సంగీతం, పాటలు అంటే ప్రాణం. చిన్ననాటి నుంచే సాధన చేసి గాయనిగా కెరీర్ ప్రారంభించారు. తెలుగు, తమిళ బాషల్లో వందలాది పాటల పాడారు. 1991లో ఆమె తొలి పాట పాడారు. మహేశ్ నటించిన వంశీ చిత్రంలో 'సరిగమ’ తెలుగులో ఆమె పాడిన తొలిపాట. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 'ప్రేమంటే సులువు కాదురా’ (ఖుషి), 'ముసుగు వేయొద్దు మనసు మీద' (ఖడ్గం), 'అమ్మడు అప్పచి' (ఇంద్ర), 'ఏ జిల్లా ఏ జిల్లా'(శంకర్ దాదా ఎంబీబీఎస్), 'జూలే జూలే(వర్షం)', 'ఏ ఊరే చిన్నదానా (భద్ర) 'వంటి హిట్ సాంగ్స్ పాడారు.
ALSO READ: Ayesha takia: గూండాలు ఎవరో తెలుసుకుని మాట్లాడండి
Reba Vs Ketika: అందాల భామల హాట్ సాంగ్స్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి