Simran: డబ్బా పాత్రల కన్నా.. ఆ పాత్రలు ఎంతో ఉత్తమం..
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:21 PM
ఇటీవల నటి సిమ్రాన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దానిపై ఆమె క్లారిటీ ఇచ్చారు.
"సినిమాలో ఏదో ఒక మూలన, నాలుగు సీన్స్ కోసం తెరపైౖ కనిపించడం కంటే అర్థవంతమైన అమ్మ లేదా అంటీ పాత్రలో నటించడం ఉత్తమం’’ అని సిమ్రన్ అన్నారు. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దానిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘ఇటీవల ‘నా తోటి నటి చేసిన కామెంట్స్ నన్నెంతో బాధించాయి. ఆ బాధతోనే ఈ మధ్యన ఓ వేడుకలో నాకు అనిపించింది చెప్పాను. కెరీర్ ఆరంభం నుంచి అప్పుడప్పుడూ ఆంటీ రోల్స్‌లో యాక్ట్ చేస్తున్నా. అలా యాక్ట్ చేయడంలో తప్పేముంది. ఆ పాత్రలు చేయడం నాకు ఇష్టమే. నిజం చెప్పాలంటే ఇండస్ర్టీలో ఉండే హీరోయిన్స్ ఎప్పటికీ స్నేహితులు కాలేరు. నాకు ఎదురైన అనుభవంతో అది మరోసారి నిరూపితమైంది. ేస్నహితులనుకున్న వాళ్లు కొన్ని సందర్భాల్లో తమ కామెంట్స్‌తో మనల్ని ఎంతో బాధ పెడతారు. ఆ అవార్డుల కార్యక్రమం తర్వాత ఆ నటి నాకు మరోసారి ఫోన్ చేసింది. నేను ఏమీ ఇబ్బందిపడలేదు కానీ, ఆమెతో అంతకుముందు ఉన్న రిలేషన్ ఇప్పుడు లేదు’’ అని సిమ్రన్ అన్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ఈ మధ్యనే ఓ అవార్డు వేడుకలో సిమ్రన్ పాల్గొన్నారు. తోటి నటి వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ‘‘కొన్ని రోజుల క్రితం నాకు బాగా తెలిసిన తోటి నటికి సందేశం పంపించాను. ఓ సినిమాలో ఆమె రోల్ చాలా బాగుందని.. ఆ రోల్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పా. ఆంటీ రోల్స్‌లో నటించడం కంటే ఇది ఎంతో ఉత్తమం అంటూ ఆమె రిప్లై ఇచ్చింది. ఆమె మాటలు చులకన చేసినట్లు నాకు అనిపించింది. ఈ వేదికగా ఆమెకు నేను చెప్పేది ఒక్కటే. పనికిమాలిన రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు చేయడం ఎంతో ఉత్తమం. జీవితంలో దేనినీ తక్కువగా చూడకూడదు’’ అని సిమ్రన్ అన్నారు. ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. సిమ్రన్ ఇటీవల ‘గుడ్‌బ్యాడ్ అగ్లి’లో నటించారు.
ALSO READ: Anupama Parameswaran: హిట్ పెయిర్ మరోసారి.. కలిసొస్తుందా..
Shruti Haasan : మెర్సిడెస్ బెంజ్ టూ మెట్రో ట్రైన్