Siddu Jonnalagadda: హీరో పాత్రకు ఆ స్టైల్ తీసుకొచ్చిందే పవన్‌కల్యాణ్..
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:08 PM
ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. దాన్ని ఎలా సాధిస్తామనేది ముఖ్యం. అదే ఈ సినిమాలో చూపించారు. ఆడియన్స్‌కు వినోదాన్ని పంచడమే మా ముఖ్య ఉద్దేశం.
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కథానాయకుడిగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జాక్’ (Jack). వైష్ణవి చైతన్య (vaishnavi Chaitanya) కథానాయిక. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ )BVSN Prasad) నిర్మాణంలో ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలోని కిస్ సాంగ్‌ను గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. దాన్ని ఎలా సాధిస్తామనేది ముఖ్యం. అదే ఈ సినిమాలో చూపించారు. ఆడియన్స్‌కు వినోదాన్ని పంచడమే మా ముఖ్య ఉద్దేశం. ‘ఆరెంజ్’ సినిమాలో ఒక పాత్రలో నటించాను. ఇన్నేళ్ల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్‌తో పని చేయడం అప్పటి రోజుల్ని గుర్తు చేసింది’’ అని సిద్ధూ జొన్నలగడ్డ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ
"ప్రతి హీరో కెరీర్‌లో ఒక ప్రత్యేక పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా కెరీర్‌కు టిల్లు పాత్ర అలా గుర్తుండిపోతుంది. రామ్‌చరణ్‌తో కలిసి ‘ఆరెంజ్’ సినిమాలో నటించాను. భవిష్యత్తులో అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. నేను దర్శకుడి ప్రతిభ చూస్తాను. ఆయన హిట్ సినిమాలు తీస్తున్నారా, లేదా అని నేనెప్పుడూ ఆలోచించలేదు. బొమ్మరిల్లు భాస్కర్ తీసిన ప్రతి సినిమా కొత్తగానే ఉంటుంది. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశా’’ అని అన్నారు. (Bommarillu Bhaskar)
పవన్ కల్యాణ్ ‘ఖుషి’లో ఒక స్టైల్ ఉంటుంది. మళ్లీ అలాంటి స్టైల్ మీ సినిమాల్లో కనిపిస్తుంది.. అన్న ప్రశ్నకు ఆయనతో నన్ను పోల్చడమే నాకు ప్రశంసతో సమానం. సినిమాల్లో హీరో పాత్రకు ఒక స్టైల్ తీసుకువచ్చింది పవన్‌కల్యాణే. ఆయనలా నేను కనిపించడం ప్లాన్ చేసుకున్నది కాదు. నాకు తెలిసినట్లు నటించాను. అలా గుర్తింపు వచ్చిందంతే.