Shruti Haasan: డ్రాగన్‌లో శ్రుతీహాసన్‌.. గ్లామర్‌ కోసమేనా..

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:00 PM

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ‘డ్రాగన్‌’ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారీ యాక్షన్స్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు. ఇది పెద్ద షెడ్యూల్‌ అని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌(NTR), ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కాంబినేషన్‌లో ‘డ్రాగన్‌’ (Dragon) చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారీ యాక్షన్స్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు. ఇది పెద్ద షెడ్యూల్‌ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ ఉందని ప్రచారం సాగుతోంది. ఇందులో  శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కనిపించబోతోందని చిత్ర వర్గాల నుంచి టాక్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన సలార్‌ చిత్రంలో శ్రుతీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ‘సలార్‌ 2’లోనూ శ్రుతి కనిపించబోతోంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్‌ ని ప్రశాంత్‌ నీల్‌ రిపీట్‌ చేయబోతున్నాడని తెలుస్తోంది. (Shruti Haasan spl song)


మామూలుగా ప్రశాంత్‌ నీల్‌ సినిమాల్లో యాక్షన్‌కి చోటు ఉంటుంది కానీ పాటలకు అంత స్కోప్‌ ఉండదు. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కోసం ఓ పాటను పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ సినిమాల్లో ఇంతకు ముందు లేనని పాటలు ఈ చిత్రంలో ఉంటాయని కూడా సమాచారం. వాటిలో శ్రుతీహాసన్‌ ప్రత్యేక గీతం కూడా ఒకటి. ఈ చిత్రంలో తారక్‌ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ కథానాయికగా నటిస్తోంది. రుక్మిణీ వసంత్‌ ఈ చిత్రంలో కథానాయికగా నటించబోతోంది. ఇందులొ రుక్మిణిది సాధారణ పాత్ర కాదని, కాస్త టిపికల్‌గా ఉండే పాత్రని అందుకే గ్లామర్‌ కోసం శ్రుతిహాసన్‌తో సాంగ్‌ ప్లాన్‌ చేశారని సమాచారం. టాకీ పార్ట్‌ పూర్తయిన తరువాత ఈ పాటని తెరకెక్కిస్తారు.

Updated Date - Apr 25 , 2025 | 12:02 PM