Shruti Haasan : మెర్సిడెస్ బెంజ్ టూ మెట్రో ట్రైన్
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:56 PM
కమల్‌హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనిపించుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతీహాసన్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సినిమా కుటుంబం నుంచి వచ్చినా.. ఎప్పుడూ దాన్ని దృష్టిలో పెట్టుకోలేదని శ్రుతీహాసన్ (Shruthi Haasan) అన్నారు. విశ్వనాయకుడు కమల్‌హాసన్ (Kamal Haasan) కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనిపించుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతీహాసన్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇండస్ట్రీకి రావడానికి ముందు ఎన్నో విషయాలు తీసుకున్నట్లు చెప్పారు.
‘‘నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు నా జీవితంలో ఏం జరిగిందో చాలా మందికి తెలియదు. నా తల్లిదండ్రులు విడిపోవడం నన్ను ఎంతో బాధించింది. వారిద్దరూ విడిపోయాక నేను అమ్మతో ఉన్నాను. అప్పటివరకు ఉన్న జీవితం ఒక్కసారిగా మారిపోయింది. చెన్నై నుంచి ముంబయి వచ్చేశాం. విలాసవంతమైన జీవితం దూరమైంది. అప్పటివరకూ మెర్సిడెస్ బెంజ్ కారులో తిరిగిన నేను లోకల్ ట్రైన్‌లో ప్రయాణించాను. రెండు రకాల జీవితాలు చూశాను. ఇండస్ట్రీకి వచ్చాక నాన్నతో ఎక్కువగా ఉంటున్నాను. విదేశాల్లో సంగీతం నేర్చుకున్నాను. నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నాను. నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న సమయంలోనే జీవిత పాఠం నేర్చుకున్నాను’’ అని అన్నారు. శ్రుతిహాసన్ తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక (Saarika) 2004లో విడిపోయారు. ప్రస్తుతం శ్రుతి రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.