Akhanda 2: 'అఖండ 2'లో అలనాటి స్టార్ హీరోయిన్..
ABN , Publish Date - Jan 20 , 2025 | 10:42 AM
Akhanda 2: నందమూరి బాలకృష్ణ (NBK) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akahnda 2: Thandavam) . ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో మూవీ చిత్రీకరణ జరుగుతోంది. కాగా, ఇప్పటివరకు ఈ మూవీ కాస్టింగ్ పై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. 18 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినా అలనాటి తార ఒకరు ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరంటే..
నందమూరి బాలకృష్ణ (NBK) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akahnda 2: Thandavam) . ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో మూవీ చిత్రీకరణ జరుగుతోంది. కాగా, ఇప్పటివరకు ఈ మూవీ కాస్టింగ్ పై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. 18 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినా అలనాటి తార ఒకరు ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ ఆమె ఎవరంటే..
యంగ్ డేస్ లో కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ లలో తన అందం, అభినయంతో అలరించిన స్టార్ హీరోయిన్ శోభన. ఆమె 18 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ 'కల్కి' సినిమాలో 'మరియమ్' పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె బాలయ్య 'అఖండ 2' సినిమాలో ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఆ పాత్రా ఒక సన్యాసిని అని టాక్. ఇప్పటికే ఆమె బాలయ్యతో నారి నారి నడుమ మురారి వంటి చిత్రాలలో యాక్ట్ చేసింది.
మరోవైపు కొన్నిరోజుల క్రితం డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘‘మహా కుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూట్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. అఘోరా నేపథ్యంలో సాగే కథ ఇది. సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించేందుకు వచ్చాం. జనవరి 11 నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ రోజుతో ఇక్కడ షూట్ పూర్తవుతుంది. నాగసాఽధువులు, అఘోరాలను కలిశాం. మా ప్రయత్న లోపం లేకుండా చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల శ్రమిస్తున్నాం’’ అన్నారు.
2021లో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రానికి కొనసాగింపుగా అఖండ-2: తాండవం తెరకెక్కుతోంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని సమర్పకులు. బోయపాటి, బాలయ్య కాంబోతో వస్తున్న నాలుగో చిత్రమిది. సెప్టెంబర్ 25న ఈ చిత్రానికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ లతో పాటు అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.